500 కిమీ మార్క్ కు చేరుకున్న లోకేష్ పాదయాత్ర

Monday, September 16, 2024

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం  పాదయాత్ర గురువారం నాటికి 500 కిమీ మార్క్ పూర్తిచేసుకొంటుంది. బుధవారం నాటికి 38 రోజులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసి మొత్తం మీద 497 కిలోమీటర్లు నడిచారు.

నాలుగు రోజులగా లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో యాత్ర సాగించిన లోకేష్ బుధవారం మదనపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. మరో 14 కిమీ పూర్తి చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంప్ సైట్ లో మహిళలకు పాదాభివందనం చేసిన లోకేష్,వారితో సమావేశమై ఇబ్బందులను తెలుసుకున్నారు.

అనంతరం మహిళలు పెద్దఎత్తున యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ మహిళలకు పాదాభివందనం చేస్తూ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని.. అమ్మ లేనిదే మనకు జన్మ లేదు అని ఈ సందర్భాంగా భావోద్వేగంగా చెప్పారు.

అమ్మలేకపోతే మనకు జన్మలేదని, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలు మోస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామని లోకేష్ ప్రకటించారు.

నేడు  మహిళా మంత్రులే మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా మంత్రి రోజా తనకు చీర, గాజులు పంపుతాను అన్నారని గుర్తు చేశారు. మహిళలు అంటే వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు? అని ప్రశ్నించారు.

 జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని చెబుతూ కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయని, మరో 900 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయని లోకేష్ తెలిపారు. సిఎం సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళ పై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని లోకేష్ గుర్తుచేశారు.

ఆ తర్వాత పాదయాత్ర జమనపల్లి వద్దకు చేరుకోగానే బాణాసంచా మోతలతో దద్దరిల్లింది. చింతలవారిపల్లిలో మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిచ్చి స్వాగతం పలికారు. విటలం గ్రామంలో యువనేతపై పూలవర్షం కురిపించి బాజాభజంత్రీలతో తమ గ్రామంలోకి ఆహ్వానించారు.

మధ్యాహ్నం పునుగుపల్లిలో భోజన విరామానంతరం పాదయాత్ర వాయల్పాడు చేరుకున్న సమయంలో అక్కడి ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. వాయల్పాడు పట్టణంలో దారిపొడవునా యువతీయువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్లవెంట బారులు తీరారు.

గురువారం పులవాండ్లపల్లి నుండి పాదయాత్ర ప్రారంభించి పాల ఏకిరి సామాజికవర్గం ప్రతినిధులతో, బోయ సామజిక వర్గీయులతో భేటీ అయ్యారు. సిటిఎం-2 పంచాయతీలో పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరుకొంది. ఈ సందర్భంగా శిలాఫలకంను ఆవిష్కరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles