25న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరిక!

Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల రాజకీయ భవిష్యత్ గురించిన సస్పెన్స్ కు త్వరలో తెరపడనుంది. బిజెపి, కాంగ్రెస్ లలో ఏ పార్టీలో చేరతారు? లేదా మరో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తారా? అని కొద్దికాలంగా వ్యాపిస్తున్న ఊహాగానాలకు ముగింపు పలకనున్నారు.

ఈ నెల 25న వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ రోజున రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తారని, ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో వారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత వారం రోజులుగా రాహుల్ గాంధీ ఎన్నికల బృందం వారిద్దరితో జరుపుతున్న చర్చలు ఈ మేరకు కొలిక్కి వచ్చిన్నట్లు వెల్లడైంది. ప్రియాంక గాంధీ సహితం పొంగులేటితో ఫోన్ లో మాట్లాడారని చెబుతున్నారు. ఈ లోగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుండి తిరిగి రాగానే ఈ నెల 12న  ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ లోని ముఖ్యనేతలతో ప్రియాంక గాంధీతో కలిసి భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహం గురించి చర్చింపనున్నారు.

వీరిద్దరిని బీజేపీలో చేర్పించేందుకు మాజీ మంత్రి, ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పొంగులేటి స్వయంగా ఖమ్మం జిల్లాలో చేయించుకున్న సర్వేలలో అక్కడ బిజెపి ఉనికి లేదని తెలియడం, బిజెపి, బిఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉందని వెల్లడి కావడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

పైగా, తాము కోరుకున్న సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్దపడటం, వారి మద్దతుదారులు సహితం కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు బీజేపీ నుండి కొందరు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో గెలుపు తర్వాత తమ `నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ’ అని అమెరికా పర్యటనలో ప్రకటించిన రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన సొంత బృందం స్వయంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై కన్నేసింది. మరోవంక ఎన్నికల వ్యూహకర్త సురేష్ కనుగోలు వ్యూహాత్మకంగా వేయవలసిన అడుగుల గురించి పార్టీకి మార్గదర్శనం చేస్తున్నారు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles