2024 లో వామపక్షాలతో పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

Saturday, November 9, 2024

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో పొత్తు ఏర్పరచుకొని పోటీచేయాలని ప్రయత్నిస్తూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అందుకు బిజెపి విముఖంగా ఉండటం, జనసేనలో సహితం స్పష్టత లోపించడంతో విసుగు చెందిన్నట్లు కనిపిస్తున్నది. ఏదేమైనా 2024 వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాలలో ఎమ్యెల్సీ ఎన్నికలలో వామపక్ష అభ్యర్థులకు ఓటు వేయమని పిలుపునివ్వడం ద్వారా వామపక్షాలతో సయోధ్యకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, 2024 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నాంది అని అభివర్ణించడం ద్వారా 2024లో వామపక్షాలతో కలసి ప్రయాణించబోతున్నట్లు వెల్లడించారు.

టిడిపి మూడు పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టగా, రెండు ఉపాధ్యాయ స్థానాలలో ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. దానితో  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని, రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్‌ అభ్యర్థికి వేయాలని పిలుపునిచ్చారు.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఎలాంటి ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను ఏపీటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని సూచించారు.

సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో వర్చువల్‌గా సమావేశమైన చంద్రబాబు ఈ పిలుపిచ్చారు.  పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ 30 శాతం దొంగ ఓట్లు చేర్చిందని చెబుతూ వైసీపీకి ఎవ్వరూ ఎలాంటి ఓటు వేయొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. దొంగ ఓట్లు వేసేవారిపై కేసులు పెట్టడంతో పాటు.. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిని వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు.

టీచర్ల సమస్యలపై మండలిలో పోరాడేవారికి ఓటేయాలని చెబుతూ వామపక్ష అభ్యర్థులకు చంద్రబాబు మద్దతు పలికారు. ఒక్కో టీచర్‌కు రూ.5 వేలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని, అవినీతి డబ్బుతో టీచర్ల ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనన ఆయన ఉపాధ్యాయులను హెచ్చరించారు. జగన్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ పతనమైపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపితో పొత్తును తెంచుకున్న తర్వాత తన పార్టీతో పాటు ఇతర పార్టీ అభ్యర్థికి కూడా ఓటు వేయాలని చంద్రబాబు అభ్యర్థించడం ఇదే మొదటిసారి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles