హైకోర్టులో వెల్లడైన అక్రమాలలో జగన్ కు కేంద్రం భరోసా!

Sunday, November 17, 2024

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న అక్రమాలకు, అడ్డదిడ్డంగా  పాల్పడుతున్న అవినీతి చర్యలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తున్నది. రాష్ట్రంలో బిజెపి నేతలు పేరుకు జగన్ ప్రభుత్వంపై మీడియాలో విమర్శలు కురిపిస్తున్న, అక్రమాలను అడ్డుకొనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుండి చేపట్టడం లేదు. పైగా, అవసరమైన మద్దతు అందిస్తున్నారు. 
ఈ విషయమై ఏపీ హైకోర్టులో స్పష్టంగా వెల్లడైనది. 

రిషికొండ అక్రమ తవ్వకాలపై  విచారణ సందర్భంగా ఈ విషయమై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లు కనిపిస్తోందని పేర్కొంటూ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల కుముక్కు వ్యవహారాలను హైకోర్టు బహిర్గతం చేసింది. 

అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్రం ఎందుకు నియమించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నియామకాలు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరపు లాయర్లు కేఎస్ మూర్తి, అశ్వినీకుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న అక్రమాలను బట్టబయలు చేయడం కోసం నియమించిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులనే నియమించడం ద్వారా జగన్ అక్రమాలను కాపాడటం కోసం కేంద్రం పడుతున్న తాపత్రయం బహిర్గతమైంది. 

ఈ విషయమై   కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించగా  ఏపీ ప్రభుత్వ అధికారుల నియామకాన్న సమర్థిస్తూ కేంద్రం అఫిడవిట్  దాఖలు చేయడం పట్ల ధర్మాసనం సీరియస్ అయింది. రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లు కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తామే కమిటీ నియమించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది కూడా. 

హైకోర్టు కీలక ఆదేశాలు 

ఇలా ఉండగా,  రుషికొండ వద్ద టూరిజం ప్రాజెక్టు పేరుతో అనుమతి తీసుకున్న విస్తీర్ణం కంటే అధికంగా కొండను తవ్వేశారంటూ పిటిషన్ల దాఖలవడంతో ఎపి హై కోర్టు రుషికొండ తవ్వకాల పై కీలక ఆదేశాలు జారి చేసింది. జనవరి 31 లోగా కేంద్రం నివేదిక ఇవ్వాలని, సర్వే టీంలో ముగ్గురు ఎపి అధికారులను తొలగించాలని ఆదేశించింది. 

ఇది వరకు తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కమిటి ఏర్పాటు చేసినప్పటికి అందులో రాష్ట్ర అధికారులకు స్థానం కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే ఐదుగురు సభ్యులతో కమిటి నియమించాలని తెలిపారు. అదే విధంగా అధికారుల వివరాలు హైకోర్టుకు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవిశాఖకు ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.

రాజ్యసభలో కేంద్ర మంత్రి భరోసా  మరోవంక, రాజ్యసభలో మాత్రం రిషికొండ తవ్వకాలలో ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌లో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ హెచ్చరించారు. రిషికొండలో తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆదేశాలతో కమిటీ నియమించామని తెలిపారు. అయితే, ఆ కమిటీలో ముగ్గురు ఏపీ ప్రభుత్వ అధికారులను నియమించడం ఏమిటని ప్రశ్నించడం ద్వారా కేంద్రం డొల్లతనాన్ని హైకోర్టు నిలదీసింది.  

ఈ ప్రాంతాన్ని సర్వే చేయడానికి ఒక బృందాన్ని నియమించాలని, నిర్మాణ కార్యకలాపాలు జరిగిన కచ్చితమైన ప్రాంతం, స్లాపింగ్ కోసం ఉపయోగించిన ప్రాంతం గురించి ఓ నివేదికను సమర్పించాలని ఏపీ హైకోర్టు కేంద్ర పర్యాటక శాఖను ఆదేశించిందని మంత్రి అశ్వినీ కుమార్ వివరించారు. దీంతో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

 రుషికొండ ప్రాజెక్టులో సీఆర్‌జెడ్ ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ త్వరలోనే బహిర్గతం చేస్తుందని ఆ ప్రశ్న వేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేయడం తప్ప మరేమీ చేయలేక పోయారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles