హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పులో జగన్ కు చుక్కెదురు!

Monday, November 25, 2024

దిగవంత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నెలకొల్పిన విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి గతంలో టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు పెట్టగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకపక్షంగా దాని పేరును తన తండ్రి పేరుతో మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది.

రాజకీయాలకు అతీతంగా ఈ విధంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఇప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నెలకొల్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ విధంగా పేరు మార్చడాన్ని దేశంలో వైద్య విద్యను పర్యవేక్షిస్తూ, నియంత్రించే నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) ఇంకా గుర్తింపలేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అర్ధాంతరంగా పేరు మార్చితే తమ డిగ్రీలకు ప్రమాదం ఏర్పడుతుందని అప్పట్లో వైద్య విద్యార్థులు సహితం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తన ఉత్తరువులలో ఎన్ఎంసి ఆ యూనివర్శిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతోనే గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఈ విషయానికి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కి సంబంధించిన నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఎఆర్ బి) ఏప్రిల్ 21, 2023న విడుదల చేసిన లేఖలో ఈ విషయం స్పష్టమైంది. అందులోని ఓ పేరాలో విజయవాడలోని డాక్టర్ ఎన్టీఅర్  యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ప్రస్తావించింది. తద్వారా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించలేదని స్పష్టం అవుతుంది.

ఈ లేఖను 150 ఎంబిబిఎస్ సీట్లకు సంబంధించి ఆ బోర్డు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నంద్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ‌లో ఎంబిబిఎస్ కోర్సుకు అనుమతికి సంబంధించి ఈ లేఖను విడుదల చేసింది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ  విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోకి వస్తుందని తెలిపింది.

నేషనల్ మెడికల్ కాన్సిల్‌కి సంబంధించిన ఈ బోర్డు  నంద్యాల మెడికల్ కాలేజీలో  ఎంబిబిఎస్ కోర్స్ ప్రారంభించేందుకు తగిన వసతులు ఉన్నాయో లేదో పరిశీలించి 150 సీట్లకు అనుమతికి సంబంధించి ఏం చెయ్యాలో తెలిపింది. ఐతే ఇందులో విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ప్రస్తావించిందే గానీ ఎక్కడా వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని ప్రస్తావించలేదు. అందువల్ల నేషనల్ మెడికల్ కౌన్సిల్  అలా గుర్తించలేదనే అభిప్రాయం వెల్లడవుతోంది.

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైసిపి  ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చింది. ఇందుకోసం బిల్లులో సవరణలు కూడా చేసింది. దీనిపై అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన చేయడంతో13 మందిని స్పీకర్ సస్పెండ్ చేశారు కూడా.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles