టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాతో ఏదొక స్పెషల్ పాయింట్ తో అలరించేందుకు సిద్దమవతుంటాడు. అలా రీసెంట్ గానే “మెకానిక్ రాకీ” సినిమాతో తాను అలరించగా ఇపుడు మరో క్రేజీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరి ఆ సినిమానే “లైలా”. డైరెక్టర్ రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించబోతునున్నాడు. దీంతో ఈ పాయింట్ పై మంచి బజ్ ఉంది. ఇక తాజాగానే వచ్చిన టీజర్ కూడా అలరించగా ఇపుడు సినిమా రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ నటిస్తుండగా తనతో కలిపి ఒక హాట్ రొమాంటిక్ సాంగ్ ని ఈ జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు.
ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే ఈ సాంగ్ లో హీరోయిన్ మంచి హాట్ ట్రీట్ ఇచ్చేలా కనపడుతుంది. ఇక ఈ చిత్రానికి దాస్ కా ధమ్కీ సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ స్వరాలు అందిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.