సొంత పార్టీ నేతనే చంపుతానని బెదిరించిన కోమటిరెడ్డి!

Saturday, January 18, 2025

పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని అలిగి, నిత్యం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా నియామకం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంతపార్టీ నేతనే చంపుతానని బెదిరించడం కలకలం రేపుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ అంటూ ఆయన కుమారుడికి ఫోన్‌లో స్వయంగా హెచ్చరించడం రాజకీయ దుమారం రేపుతోంది.

తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోమని చంపేయడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌లో హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని తాను ఆపలేనని హెచ్చరించారు.

ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చెరుకు సుధాకర్‌ తనయుడు డాక్టర్‌ సుహాస్‌కు ఫోన్‌ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. సుధాకర్‌ను చంపేందుకు తన అభిమానులు వంద కార్లలో బయటికి వచ్చారంటూ దాదాపు 2 నిమిషాలపాటు బూతులు తిట్టారు. అంతేకాదు ‘నిన్ను కూడా చంపుతారు. నీ ఆస్పత్రిని కూలగొడతారు’ అని సుహా్‌సను బెదిరించారు. ఈ ఆడియో మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది.

తన కుమారుడికి ఫోన్‌ చేసి తిట్టడడం పట్ల సుధాకర్ విస్మయం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, ఆయన స్టార్‌ క్యాంపెయినర్‌గా పని చేస్తున్నారని, తనపై ఆ భాష ఏంటని ప్రశ్నించారు. పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకట్‌రెడ్డి డకౌట్‌ అయిన వికెట్‌ అంటూ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకట్‌రెడ్డిపై అధిష్ఠాన మే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

‘నయీం లాంటి కరడుగట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకపోయాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేస్తాడు?’ అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ కోమటిరెడ్డి మతి ఉండి మాట్లాడాడో, మతిలేక మాట్లాడాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.

కాగా,  తనతో పాటు తన తండ్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను చంపేస్తారంటూ ఫోన్‌లో బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్‌ చెరుకు సుహాస్‌ నల్లగొండ వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు.

మరోవంక, చెరుకు సుధాకర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను నల్లగొండలో బీసీ విద్యార్థి సంఘం నేతలు దహనం చేశారు. చెరుకు సుధాకర్‌ హత్యకు ప్లాన్‌ చేసిన వెంకట్‌రెడ్డిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని సంఘం అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొరకరాని కొయ్యగా మారాడు.  నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలంటూ తరచూ మెలికలు పెడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పటివరకు నల్గొండ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసి వచ్చేవారు.

కానీ ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ముందు వరకు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో చెరుకు సుధాకర్‌కు ప్రాధాన్యత పెరుగుతుండడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కసు వెళ్లగక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నకిరేకల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ బలపడితే తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోవడం కష్టం అవుతుందని, ఎలాగైనా చెరుకు సుధాకర్‌కు చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చెరుకు సుధాకర్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడంతో ఆ ఎత్తులు పనిచేయడం లేదు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పార్టీ అధిష్టానం పైన, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపైన ఇప్పటికే పలు మార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా పార్టీ అధిష్టానం ఏనాడు చర్యలు తీసుకుంది లేదు. ఒకానొక దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ పైన డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు.

అంతకు ముందు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బిజెపి నుండి పోటీ చేసిన తన సోదరుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసినా ఏఐసీసీ మౌనంగా ఉండటం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles