సుప్రీంకోర్టులో కవిత పిటీషన్ తో ఆత్మరక్షణలో ఈడీ!

Saturday, January 18, 2025

లిక్కర్ స్కాంలో కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై ఈడీ అధికారులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. దానితో కవిత వేసిన పిటీషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ హడావుడిగా శనివారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

మహిళా హక్కుల గురించి పిటీషన్‌లో కవిత పేర్కొంటూ కీలక అంశాలను అందులో ప్రస్తావించింది. తనను రాత్రి 8 గంటల నిమిషాల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చొబెట్టడాన్ని కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సూర్యాస్తమం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో కూర్చోబెట్టకూడదని చట్టం చెబుతోందని కవిత ఆ పిటీషన్‌లో పేర్కొంది.

ఒక మహిళను కార్యాలయానికి పిలిపించి విచారించవద్దని కవిత పిటీషన్ దాఖలు చేసింది. కవిత లేవనెత్తిన అంశాలలో అత్యున్నత న్యాయస్థానం ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ దోషిగా నిలబడే ప్రమాదం ఏర్పడింది. అందుకనే తమ వాదన వినేంతవరకు కవిత పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈడీ సుప్రీంకోర్టును హడావిడిగా అభ్యర్థించినట్లు స్పష్టం అవుతుంది.

పైగా, ఈడీ బెదిరిస్తోందని, బలప్రయోగంతో పాటు థర్డ్‌ డిగ్రీ పద్ధతులు అవలంభిస్తోందని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని పిటిషన్‌లో  కవిత కోరారు. నళినీ చిదంబరం కేసులో మహిళను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఒత్తిడి చేయబోమని ఈడీ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిందని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 అయినా కూడా తనను కార్యాలయానికి పిలిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. మార్చి 24న సుప్రీంలో కవిత పిటిషన్‌పై విచారణ ఉండటంతో అప్రమత్తమైన ఈడీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినుకుండా ఎలాంటి నిర్ణయం ప్రకటించొద్దని సుప్రీంను కోరింది.

కవిత కేసులో ఎలాంటి ముందస్తు ఆర్డర్లు లేకుండానే కేవియట్ దాఖలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ నెల 24న సుప్రీంలో జరిగే విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 20న విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి సమన్లు అందించింది. అయిత సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు తాను ఎలాంటి విచారణకు హాజరుకాబోనని కవిత స్పష్టం చేశారు.

దానితో విచారణకు కవిత హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పుడు ఈడీ ఏవిధంగా స్పందిస్తుందన్నది చూడవలసి ఉంది. నేరుగా ఆమెను అరెస్ట్ చేస్తారా? లేదా 24న సుప్రీంకోర్టు విచారణ వరకు ఆగుతారా? అన్నది చర్చనీయాంశమైంది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అనుమానితురాలిగా ఈడీ వాదిస్తోంది. ఇందుకు తోడు అరుణ్ పిళ్లై గతంలో తాను కవిత ప్రతినిధినని ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీ అనుమానానికి బలం చేకూరింది. కానీ కవిత విచారణకు ముందు రోజే తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు పిళ్ళై కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ కవితను ఈడీ విచారించింది.

అయితే విచారణ రోజున కవితను సుమారు 9 గంటల పాటు ప్రశ్నించిన ఇది విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగించటంతో కవితకు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈడీ విచారణ తీరును ప్రశ్నించే అవకాశం ఏర్పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles