సీబీఐ పేర్కొన్న వాంగ్మూలం తనది కాదన్నఅజయ్ కల్లాం

Wednesday, January 22, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐ తాజాగా కోర్టులో దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన సాక్ష్యాలు తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయంకు అనుమానాలు కలిగిస్తుండటంతో ఝలక్ కలిగినట్లయింది. కీలక వ్యక్తులు ఇచ్చిన వాగ్మూలంలో తెల్లవారు జామునే హత్య జరిగిన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసని సీబీఐ పేర్కొనడంతో నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్లయింది.

ఈ సందర్భంగా ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శితో పాటు పలు కీలక పదవులలో పనిచేసి, ప్రస్తుతం రాష్త్ర ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది.   వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తాను చెప్పిన స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొందని ఇప్పుడు చెబుతున్నారు.
 తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం భిన్నంగా ఉందని విన్నవించారు. వివక్ష, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వ‌క్రీక‌రిస్తోందంటే విచార‌ణ ఏ స్థాయిలో ప‌క్క‌దారి ప‌డుతోందో అర్థం చేసుకోవ‌చ్చంటూ సిబిఐ విచారణపై బురదజల్లే ప్రయత్నం చేశారు. 

ఇదంతా ఎవ‌రి ప్రోద్బ‌లంతో జ‌రుగుతోంది? సీబీఐ లాంటి సంస్థ ఎందుకు వివేకా హ‌త్య కేసును ఏక‌ప‌క్షంగా విచార‌ణ చేస్తోంది? అంటూ ఓ రాజకీయ నాయకుడి మాదిరిగా ప్రశ్నలు వేశారు. వాస్తవానికి ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు రెండు, మూడు నెలలుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరోక్షంగా సీబీఐ వాదనను సమర్ధించారు.

సిబిఐ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసి కూడా దాదాపు నెలరోజులవుతుంది. ఇప్పటివరకు మౌనంగా ఉంది, ఇప్పుడు హైకోర్టును ఆసరాయిస్తూ సిబిఐ కధనాన్ని తప్పుబట్టడం గమనిస్తే వత్తిడుల కారణంగా వ్యవహరిస్తన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. పైగా, సీబీఐ ఆయనను విచారించినప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది.

మార్చి 15, 2019న వైఎస్ జగన్‌ నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందని, ఆ తర్వాత గంటన్నరకు అటెండర్‌ వచ్చి డోరు కొట్టారని.. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారని తెలిపారు. వెంటనే జగన్‌ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారని పేర్కొన్నారు. 

ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని, అయితే సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని ఆయన ఆరోపించారు.  జగన్‌ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని, తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తుందని.. కొంతమంది వ్యక్తులను ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సీబీఐ ఇది చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.

ఈ రిట్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని, తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్‌‌కు ఎలాంటి విలువ లేదని పేర్కొన్నారు. సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చేసినట్లు అజయ్ కల్లాం ఆరోపిస్తున్నారు.

కాగా, వైఎస్.వివేకా హత్య కేసులో అధికారులు తడబడుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సానుభూతి చూపారు. ‘‘అజయ్ కల్లం మంచివాడు. కానీ ఆయన దుష్టుడి దగ్గర పని చేస్తున్నారని తెలుసు. గతంలో సీబీఐకి పచ్చి నిజాలు చెప్పారు. అజయ్ కల్లం ఉ.5 గంటలకు సమావేశానికి వెళ్లాను. ఉ.5.30కి ఫోన్ వచ్చిందని చెప్పారు. అది నిజమే కదా?” అని ప్రశ్నించారు. 
“వేరే వాళ్ల పేర్లు లాగుతున్నారని అజయ్ కల్లం చెబుతున్నారు. వివేకా హత్య తర్వాత అవినాష్ రెడ్డి వేరే వాళ్లతో కూడా మాట్లాడారని సీబీఐ చెప్పింది. అమెరికా నుంచి ఫోన్ కాల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి” అంటూ చురకలు అంటించారు.
.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles