సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై విచారణకు సిబిఐ పట్టు

Sunday, May 19, 2024

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వరుసగా సిబిఐ నుండి షాక్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కడప ఎంపీ వ.ఎస్ అవినాష్ రెడ్డిని బాబాయి వివేకానందరెడ్డి హత్యా కేసులో రెండు సార్లు విచారణకు పిలిచింది. పైగా, సీఎం జగన్ ఓఎస్డీతో పాటు, భార్య వైఎస్ భారతి పీయేని సహితం విచారణకు పిలిచింది. 

తాజాగా, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ప్రయేయంపై విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పట్టుబడుతున్నది. దానితో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి చిక్కులు మొదలయ్యాయి. తెలంగాణ హైకోర్టులో వైఎస్ జగన్ తో పాటు నిందితురాలిగా ఉన్న కేసు నుంచి ఉపశమనం పొందినా, తాజాగా సిబిఐ ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తాజాగా ఆమెపై ఉన్న కేసులపై సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. దీంతో కేసుల వ్యవహారం మరోసారి సీరియస్‌ అయ్యింది. ఏపీకి నూతన గవర్నర్‌గా అబ్దుల్ నజీర్‌ రావటం, ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోక ముందే యూనివర్శిటీ వీసీల నియామకం, జాతీయ విద్యా విధానంపై కేంద్రం నివేదిక కోరింది. ఈ పరిణామాలు సీఎం జగన్‌కు ప్రతికూలంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేయటం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించిన తెలంగాణ హైకోర్టు అభిప్రాయాన్ని కాదని, ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందంటూ సుప్రీంలో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

దాదాపు పదేళ్ళు గడిచినప్పటికీ జగన్‌ అక్రమాస్తుల కేసు ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు నుంచి ఆమెను వదిలి పెట్టకూడదని సుప్రీం కోర్టును సిబిఐ కోరింది. ఓబులాపురం ఐరన్‌ఓర్‌ కంపెనీకి సంబంధించి గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను మళ్ళీ విచారించాల్సిందేనని స్పష్టంగా తెలిపింది.

గతంలో ఈ కేసులో ఆమె అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లివచ్చింది. వాస్తవానికి రాష్ట్ర విభజన సందర్భంగా ఆమెను తెలంగాణ క్యాడర్ ఇచ్చిన్నప్పటికీ, తనతోపాటు సిబిఐ కేసులో ఆమె కూడా జైలుకు వెళ్లి రావడంతో, పట్టుబట్టి ఏపీలో పనిచేయిస్తున్నారు. గతంలో ఆమె క్యాడర్ ను ఏపీకి మార్చాలని జగన్ స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను కోరినా సాధ్యం కాలేదు.

అయితే, ఆమె ట్రిబ్యునల్ ను ఆశ్రయించి తనకు అనుకూలంగా తీర్పు పొంది, ఏపీకి మారారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాగలవారిలో ఆమె పేరు కూడా ఉండటం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles