సీఎం జగన్ ధోరణి నచ్చకనే మంత్రి ధర్మాన గైరాజరు!

Thursday, September 19, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రులలో బహుశా అందరికన్నా సీనియర్, కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం గల వ్యక్తి రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రమే. బొత్స సత్యనారాయణకన్నా ఎక్కువ కాలం మంత్రిగా ఉన్నప్పటికీ బొత్స ఎప్పుడు ధర్మాన మాదిరిగా కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించలేదు.

పైగా, తన వాక్చాతుర్యంతో అసెంబ్లీలో గాని, అసెంబ్లీ బైటగాని తన పార్టీని, ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించుకోవడంతో పాటు, రాజకీయ ప్రత్యర్థులను ఎండగట్టడంలో సహితం ఆయనకెవ్వరు సాటిరారు. ప్రస్తుత ప్రభుత్వంలో `ఉత్తరాంధ్ర సెంటిమెంట్’ను బలంగా వినిపిస్తున్న వారు సహితం ఆయనే కావడం గమనార్హం. విశాఖకు రాజధాని తరలింపుకు గట్టి మద్దతుదారునిగా ఉన్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఎమ్యెల్యేలతో జరిపిన సమీక్ష సమావేశంపై ఆయన గైరాజరు కావడం గురించి పార్టీ వర్గాలలో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. ఒకసారి తన ముఖ్య అనుచరుడు చనిపోయారని, ఇప్పుడు అసరా కార్యక్రమం ఎప్పుడో నిర్ణయించదని  తప్పించుకున్నారని హాజరు కాకుండా తప్పించుకున్నా సీఎం జగన్ ధోరణి నచ్చకనే కావాలని హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తన సీనియారిటీకి, సామర్త్యానికి సీఎం జగన్ విలువ ఇవ్వడం లేదని, అందరి మాదిరిగా తనను కూడా గాడిలో కట్టేస్తూ సమావేశాలలో ఓ దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందనే హాజరు కావడం లేదని చెబుతున్నారు. అందరి ముందు “మీ తీరు బాగోలేదు” అని ఎక్కడ చెబుతారో అనే భయంతోనే దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది.

`గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంలో తన కొడుకు, తన అనుయాయులు తిరుగుతున్నప్పటికి ..నియోజకవర్గ నేత కూడా తప్పని సరిగా తిరగాలనే నిబంధన అధిష్టానం పెట్టడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు వెల్లడవుతుంది. ఉత్తరాంధ్ర నేతల మీటింగ్ లో సీనియర్ నేతల ముందరే తన తరపున తన కొడుకు, తన అనుయాయులు తిరుగుతారని నేరుగా  చెప్పినా అధిష్టానం తప్పదు తిరగాలి అని అనడం బాధాకరంగా ఉందని మరో మంత్రి బొత్స ముందే అన్నారట.

తన పెద్దరికంకు విలువ ఇవ్వకుండా జగన్ వ్యవహరిస్తూ ఉంటాడనే ఆయన ముందు జాగ్రత్తగా సమీక్షా సమావేశాలకు వెళ్లి తలంటుకోవడం అవసరమా? అనే భావనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

ఎప్పుడు అధికారంలో ఉన్నా జిల్లాలో తనదైన శైలిలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం లేదా ప్రారంభించడం ధర్మాన చేసేవారు. కాని ఇప్పుడు నాలుగేళ్లు గడుస్తున్నా ధర్మాన మార్కు ప్రకారం ఒక్క కార్యక్రమం కూడా జిల్లాలో చేయలేక పోతున్నారు. అధినేతను కలవాలని నియోజకవర్గం గురించి చెబుతామంటే అధినేత ఒకే మాట గ్రాఫ్ తగ్గితే మమ్ములను వదులుకుంటామని చెప్పడంతో ఖంగు తిన్నారని తెలుస్తున్నది.

సీనియర్ అని  లెక్కలేకుండా అధినేత ఎట్లా పడితే ఆ విధంగా మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే,  మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బంది ముందుగానే సిఎం జగన్ అనుమతి తీసుకొని తన కార్యక్రమాలు నిర్వహణకు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన తన గైరాజరును సమర్ధించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles