ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఒకవంక, నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నిత్యం సీఎం జగన్ కు సవాళ్లు విసురుతూ ఉంటె, చంద్రబాబు నాయుడు పర్యటనలలో ఇప్పుడు సెల్ఫీలతో సవాళ్లు విసరడం ప్రారంభించారు. లోకేష్ టిడిపి హయాంలో నిర్మించిన పరిశ్రమల ముంది సెల్ఫీలు దిగుతూ `జగన్ నీ హయాంలో ఇటువంటి ఒక పరిశ్రమైనైనా నిర్మించావా’ అంటూ సవాళ్లు విసురుతూ వస్తున్నారు.
‘చూడు.. జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు’ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ కామెంట్ పెట్టారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని? నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు చంద్రబాబు.
తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరిన చంద్రబాబు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని క్యాడర్, లీడర్లకు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
“చూడు… వైఎస్ జగన్మోహన్ రెడ్డి! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు! ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?” అంటూ చంద్రబాబు నేరుగా ప్రశ్నించారు. ఇక చంద్రబాబు విసిరి సెల్ఫీ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.
ఏపీలో ఏపీలో టిడిపి హయాంలో నిర్మించినటిడ్కోఇళ్లను పేదలకు పంచితే గత ప్రంభుత్వంకు పేరు వస్తుందని వారిని శిధిలాలుగా వదిలేస్తూ, తాజాగా ఇళ్ల స్థలాలు అంటూ, ఇల్లంతా హడావుడి చేస్తుండటం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవలే టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై కేంద్రం కన్నెర్ర చేసింది.
వాటిని పూర్తి చేయడానికి ఇంకెంతకాలం కావాలంటూ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 50 వేలు, జూన్ నాటికి మరో 50 వేల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని కేంద్రం రాసిన లేఖకు టిడ్కో అధికారులు సమాధానమిచ్చినట్లు తెలిసింది. అయితే నాలుగేళ్లుగా వాటిని ఎటువంటి నిర్వహణ లేకుండా వదిలి వేయడంతో అవి శిధిలావస్థలో ఉన్నాయని, వాటిల్లో చేరితే ప్రమాదం అంటూ ఇటీవల నారా లోకేష్ ప్రజలను హెచ్చరించారు.