సింహాం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. అదరగొట్టిన ఎన్బీకే 109 గ్లింప్స్!

Sunday, December 22, 2024

సింహాం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. అదరగొట్టిన ఎన్బీకే 109 గ్లింప్స్!

నందమూరి నటసింహం బాలయ్య సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. గతేడాది బాలయ్య తన ఖాతాలో రెండు భారీ విజయాలను వేసుకున్నాడు. ఈ ఏడాది కూడా మరో హిట్ కొట్టేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే యంగ్‌ డైరెక్టర్‌ బాబీతో జత కట్టాడు. అనుకున్నట్లుగానే ఎన్బీకే 109 పేరుతో సినిమాని సెట్స్‌ మీదకు తీసుకుని వచ్చేశారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో కేవలం ఓ వ్యక్తి వెహికల్‌ మీద నుంచి దిగుతూ చేతిలో గొడ్డలితో ఉన్నట్లు మాత్రమే ఉంది. దానిని చూసిన అభిమానులకే పూనకాలు వస్తే..ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌  గ్లింప్స్‌ ని చిత్ర బృందం విడుదల చేసింది.

అందులో బాలయ్య నుంచి అభిమానులు ఏదైతే కోరుకున్నారో అదే ఉంది. బాలయ్య ఊచకోత కోస్తూ చెప్పిన డైలాగ్‌ అయితే ఆయన మార్కుకు తగినట్లుగా ఉంది. బాలయ్య బాబు అడవిలో కార్చిచ్చు మధ్య నుంచి కారులో దిగడం.. అప్పుడు ఓ బాక్స్‌ని ఓపెన్‌ చేస్తే అందులో మ్యాన్షన్‌ హౌస్‌ కనిపించడంతోనే అభిమానులు కేకలు పెడుతుంటే… బాలయ్య చెప్పిన డైలాగ్‌ అయితే పిచ్చెక్కించింది.

ఆ మంటల మధ్యలో బాలయ్య విలన్లు రఫ్పాడిస్తూ… సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌..హంటింగ్‌ అంటూ ఓ రేంజ్‌ డైలాగ్ ని డెలివరీ చేశాడు. ఈ సినిమాకి తమన్‌ అందించిన మ్యూజిక్‌ వేరే లెవల్‌ మావ అంతే అని చెప్పాలి. మరి ఈ సినిమాకు ఎన్బీకే 109 నే టైటిల్‌ గా ఉంచుతారా.. వేరేది మార్చుతారా అనేది మాత్రం చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles