సింగడు అద్దంకి వెళ్ళాడు… వచ్చాడు అన్నట్టు జగ్గడి ఢిల్లీ యాత్ర!

Sunday, December 22, 2024

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 57 రోజులుగా సాగిస్తున్న యువగళం పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన విసురుతున్న సెటైర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా పక్షం రోజులలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి రావడంపై లోకేష్ విసిరినా సెటైర్లు అందరిని ఆకట్టుకొంటున్నాయి.

సిబిఐ కేసులలో వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురైనా, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులేక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దివాళా స్థితిలో ఉన్నా జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లి నాయకులను ప్రాధేయపడటం జరుగుతూ వస్తుందనే నానుడి ప్రబలంగా వ్యాపిస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటనలపై

సింగడు అద్దంకి వెళ్ళాడు… వచ్చాడు అన్నట్టు ఉంది జగ్గడి ఢిల్లీ యాత్ర అని ఎద్దేవా చేశారు. జగన్ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. రాజ్యసభ, లోక్ సభలో కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారు. కేసుల కోసం తప్ప ప్రత్యేక హోదా గురించి జగన్, ఆయన ఎంపీలు ఏ రోజూ పోరాడలేదు రాష్ట్ర ప్రయోజనాలు నిల్లు. సొంత ప్రయోజనాలు మాత్రం ఫుల్లు అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.

యువగళం దెబ్బకు జగన్ వారానికోసారి ఢిల్లీ యాత్ర చేస్తున్నాడని , జగన్ ది పరదాల యాత్ర… ఈ లోకేష్ ది ప్రజా యాత్ర… ఏ తప్పూ చెయ్యలేదు కాబట్టే నేను ధైర్యంగా కాలర్ ఎగరేసి తిరుగుతున్నాను. తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు కాబట్టే ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా జగన్ హెలీకాప్టర్ వాడుతున్నాడంటూ లోకేష్ భారీ డైలాగ్స్ పేల్చాడు.

చంద్రబాబు హయాంలో కియ, టీసీఎల్‌, హెచ్‌సీఎల్‌తోపాటు ఎన్నో పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేసారు. నాలుగేళ్ల జగన్‌ పాలనలో ఒక్క కడ్రాయర్‌ ఫ్యాక్టరీ అయినా తీసుకొచ్చా రా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కప్పం కట్టలేక జాకీ పరిశ్రమ పొరుగు రాష్ట్రాలకు పారిపోయిందని ధ్వజమెత్తారు. వైసీపీకి 31 మంది ఎంపీలు ఉన్నా.. జగన్‌ పీకిందేమీ లేదని అంటూఢీల్లీ యాత్రను సొంత యాత్రగా మార్చేశారని చెప్పుకొచ్చారు.

జగన్ పని అయిపోయిందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటూ వైస్సార్సీపీ మేకపాటి చంద్రశేఖర్ సవాల్ ను లోకేష్ ప్రస్తావించారు. ఉదయగిరి వైస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయన ఏమాత్రం తగ్గలేదు… రోడ్డు మీద కుర్చీ వేసుకొని దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ జగన్ కే సవాల్ విసిరారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ పనైపోయింది అని చెప్పడానికి అంటూ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.

రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తూ  ఏ నియోజకవర్గానికైనా ఒక్క ఎమ్మెల్యేనే ఉంటారు. కానీ రాప్తాడుకి మాత్రం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీదుర్తి ప్రకాశ్, ఆయన తండ్రి గారు, ఇద్దరు బ్రదర్స్, ఇంకో లేడీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెబుతూ ఎద్దేవా చేశారు.

రాప్తాడు వీళ్లకి మంచి పేస్ట్రీ కేకులా దొరికింది. 5 ముక్కలుగా కోసుకొని తినేస్తున్నారు.ఈ నాలుగేళ్లలో వీళ్ల అవినీతి సంపాదన ఎంతో తెలుసా? వెయ్యి కోట్లు. దోపిడీదుర్తి కుటుంబం అధికారంలోకి రాగానే కొంత మంది పోలీసుల్ని పార్ట్నర్స్ గా చేర్చుకొని రైతులను, రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి వందల ఎకరాలు దోచేసారు అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles