సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్దభేరి

Wednesday, January 22, 2025

`సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి’ కార్యక్రమంను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కర్నూల్ జిల్లా నుండి ప్రారంభించారు. మొదటగా నందికొట్కూరులోని పటేల్ రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ ఒక అవకాశం అంటూ అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రజల నెత్తిన పిడిగుద్దులు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. 

తొలి దశలో 10 రోజుల పర్యటనను ప్రారంభిస్తూ  టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ ల పేరిట రూ.65వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో రూ.22వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్ట్ పేరిట రూ.2 వేల కోట్ల ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు.

‘‘ధ్వంసమైన సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధం ప్రకటించడానికి వచ్చాను . రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఘోరంగా ఉంది. దీనిపై జగన్ చర్చకు సిద్దమా?. చేసిన అన్యాయం ఒప్పుకొని జగన్ నేలకు ముక్కు రాయాలి. చేతకాని జగన్ రాజీనామా చేయాలి. రాయలసీమ ఎలా సస్యశ్యామలం కాదో చేసి చూపిస్తాను” అంటూ భరోసా ఇచ్చారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా, గాలేరు నగరి, వేదవతి ప్రాజెక్ట్ పనులు నిలిపివేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ ముఖ్యమంత్రి విమర్శించారు. తొలుత, చంద్రబాబు నాయుడుకు  ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘన స్వాగతం  లభించింది. చంద్రబాబుకు  ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు స్వాగతం తెలిపారు. 

కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకొస్తానని నిర్మించాడా? అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరిట వ్యవస్థను నాశనం చేశారని, అభివృద్ధిని పాతాళానికి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూపాడుబంగ్లా పరిధిలోని తంగెడెంచలో విత్తన కంపెనీ హబ్ గా మొదలు పెడితే వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు.

‘‘ధ్వంసమైన సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధం ప్రకటించడానికి వచ్చాను . రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఘోరంగా ఉంది. దీనిపై జగన్ చర్చకు సిద్దమా?. చేసిన అన్యాయం ఒప్పుకొని జగన్ నేలకు ముక్కు రాయాలి. చేతకాని జగన్ రాజీనామా చేయాలి. రాయలసీమ ఎలా సస్యశ్యామలం కాదో చేసి చూపిస్తాను” అంటూ సవాల్ చేశారు.

నందికొట్కూరులో పేద ప్రజల పేరిట రూ.ఐదు లక్షలకు తక్కువ ధరకు స్థలాలు కొని ఎక్కువ ధరకు రూ.60 లక్షలకు ప్రభుత్వానికి అమ్మిన ఘనత నియోజకవర్గం వైసీపీ నేతలకే దక్కిందని ఎద్దేవా చేశారు. అలగనూరు రిజర్వాయర్ ను మరమ్మత్తులు చేయలేని పరిస్థితిలో వైసీపీ నేతలున్నారని పేర్కొన్నారు. ఆలగనూరు నుంచి నందికొట్కూరు నియోజకవర్గం తాగునీటి అవసరాలకు రూ.70 కోట్లతో పనులు మంజూరు చేస్తే పనులు పూర్తి చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.  తాను ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు శ్రీకారం చుట్టానని, సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కానీ జగన్ వాటిని ధ్వంసం చేశాడని అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికే ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జ్ లు తగ్గిస్తామని టిడిపి అధినేత ప్రకటించారు. అందుకోసం తమ వద్ద పక్కా ప్రణాళికలు ఉన్నాయని స్పష్టం చేశారు. కరెంటు చార్జీలు పెరగకుండా తాము అధికారంలోకి రాగానే బాధ్యతలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల పేరిట బటన్ నొక్కుతున్నాడని, వాటి మాటున బోకుడు బటన్ ఎక్కువైందని దయ్యబట్టా?రు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆ డబ్బులు తాడేపల్లి కొంపకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క బ్రాందీ షాపులో అయినా బిల్ ఇస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.  ఇసుక, మద్యం, భూ దందాలు నిర్వహిస్తూ భూములు లాగేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తామని మందుబాబులకు ఆయన హామీ ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles