సవాళ్లు ప్రతి సవాళ్లతో అమరావతిలో `ఇసుక’ ఉద్రిక్తత

Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఇసుక అక్రమ తవ్వకాలపై బహిరంగ చర్చకు సంబంధించి పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో అమరావతిలో వైసిపి, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  లాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు అమరావతి ప్రాంతంలో భారీగా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి వరకు అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

అభివృద్ధి విషయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు (వైసిపి), మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ (టిడిపి) ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అవినీతిపై అమరరామలింగేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. అందుకోసమే వారిద్దరూ ఆదివారం అమరావతికి చేరుకున్నట్లు తెలియడంతో పరిస్థితులు ఒకేసారి భగ్గుమంటున్నాయి.

ఈ ప్రమాణానానికి అటు వైసీపీ ఇటు టీడీపీల నుండి కార్యకర్తలు భారీగా తరలివస్తుండడం గమనించిన అమరావతి పోలీసులు గొడవలు జరుగుతాయని ముందే ఊహించి అప్రమత్తమయ్యారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో  పోలీసులు లాఠీచార్జి చేశారు.

టీడీపీ నేతలకు 149 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అమరావతి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఐదు మండలాల్లో 200 మంది నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.
అమరావతి అమరలింగేశ్వర స్వామి సాక్షిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హయాంలో జరిగిన అవినీతిని, తన హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తానొక్కడినే వెళ్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్పష్టం చేశారు.

నాలుగేళ్ల పాలనలో తాను కానీ, నాయకులు కానీ ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. టీడీపీ పాలనకు మన పాలనకు తేడా ఆధారాలతో సహా చూపించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలే తన బలమని.. దయచేసి వాళ్లు, ఆందోళన చెందకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు.

కాగా, ప్రజాస్వామ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమని, అవి పౌరజీవనానికి విఘాతం కలిగేలా, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు లేదా ప్రమాణానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 200 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతి చుట్టూ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు

అమరావతికి వెళ్లకుండా ఇరు పార్టీల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల వద్ద పహారా కాస్తున్న నోటీసులు ఇచ్చి, ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అమరావతిలోని లాడ్జీల్లో కొత్త వ్యక్తులకు గదులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేశారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, ఎమ్మెల్యే నంబూరి శంకరరావు అమరరామలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles