షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు

Monday, May 6, 2024

లోటస్ పాండ్ వద్ద మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుంది. కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పార్టీ నేతలు,కార్యకర్తలు రాకుండా మూడు వైపుల బారికేడ్లు పెట్టారు.

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను రెండో రోజు పోలీసులు భగ్నం చేశారు. దీక్షతో నిరసించిన షర్మిలను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రికి తరలించే ముందే దీక్ష స్థలి వద్ద ముగ్గురు వైద్యులు షర్మిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో వైద్యుల సూచన మేరకు షర్మిలను పోలీసులు హాస్పిటల్ కి తరలించారు.

షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమెను దీక్షా శిబిరం నుండి ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండ్ లో షర్మిల శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.  కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పార్టీ నేతలు,కార్యకర్తలు రాకుండా మూడు వైపుల బారికేడ్లు పెట్టారు.

మరోవైపు.. తమ కూతురు షర్మిలను చూసేందుకు వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి షర్మిల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో షర్మిలను చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

 శనివారం ఆమెకు వైద్య పరీక్షలు జరిపిన వైఎస్ వివేకా కూతురు డా. సునీత, డాక్టర్ ప్రవీణ్ బృందం ఆమెకు బీపీ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. బ్లడ్ లాక్ట్ లెవెల్స్ పెరిగాయని, ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురైందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే దీని ప్రభావం కిడ్నీలపై పడుతుందని హెచ్చరించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయకపోతే షర్మిల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్కు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్గా పని చేస్తున్నారని షర్మిల  ఆరోపించారు. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా భయపడబోని ఆమె స్పష్టం చేశారు. అనంతరం పోలీసులు బలవంతంగా ఇంటి బయట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి తీసుకెళ్లారు. తన ఇంటి దగ్గర తాను దీక్ష చేపడితే ఇన్ని ఆంక్షలా? అంటూ ఈ సందర్భంగా షర్మిల మండిపడ్డారు.

 రోడ్డుపై బైఠాయించిన షర్మిల వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తల్లి వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత దీక్ష శిబిరం వద్ద షర్మిలను కలిసి ఆమె మాట్లాడారు.షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు నర్సంపేటలో బ్రేక్ పడింది. అయితే దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా పాదయాత్రకు అనుమతినిచ్చింది. పోలీసులు మాత్రం పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

కానీ ట్రాఫిక్, శాంతి భద్రతల దృష్యా ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ కూడా ఆమె ఆమరణ దీక్ష కొనసాగించారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles