శివకుమార్‌తో మరోసారి షర్మిల భేటీ

Wednesday, January 22, 2025

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పక్షం రోజులలోపు మరోమారు కర్ణాటక ఉమముఖ్యమంత్రి  డికె శివకుమార్‌తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శివకుమార్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అభినందించిన షర్మిల, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలవడం జరిగింది.

అయితే తండ్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు కావడంతో లాంఛనంగా అభినందనలు తెలపడం వరకు మాత్రమే ఆమె భేటీ పరిమితం కాలేదని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమో లేదా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే చేయాలని కాంగ్రెస్ నుండి వత్తిడులు వస్తున్న సమయంలో ఆమె భేటీ ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.

ఆమె మొదటిసారి భేటీ కావడానికి ముందే రాహుల్ గాంధీకి చెందిన బృందం ఆమెతో భేటీ జరిపి సుదీర్ఘంగా సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. శివ కుమార్ తో మొదటిసారి భేటీ జరిపిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆమెతో టెలిఫోన్ లో సంభాషణలు జరిపిన్నట్లు కూడా కధనాలు వచ్చాయి. ఈ కథనాలను ఆమె గాని, కాంగ్రెస్ వర్గాలు గాని ఖండించక పోవడం గమనార్హం.

షర్మిలను రాహుల్ బృందం కలిసినా, ఆమెతో ప్రియాంక గాంధీ మాట్లాడినా అంతా శివకుమార్ చొరవ ఫలితమే అని ఈ సందర్భంగా స్పష్టం అవుతుంది. అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల కాంగ్రెస్ తో కలసి పనిచేసే విధంగా చేయడం కోసం ఆయన శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆమె ఆయనతో జరుపుతున్న భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

మరోపార్టీలో విలీనం కోసం పార్టీ పెట్టుకోలేదంటూ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రతిపాదనను త్రోసిపుచ్చిన షర్మిలా ఎన్నికల పొత్తులను మాత్రం కాదనకపోవడం గమనార్హం. తాము కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందున ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టంగా ప్రకటించారు. తమకు మిస్డ్‌ కాల్స్ వస్తున్నాయని, “ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రతి పార్టీ సంప్రదించే ప్రయత్నం చేస్తోందని ఇందులో ఆశ్చర్యం ఏమి లేదని అని షర్మిల చెప్పారు.

షర్మిల వ్యాఖ్యలను పరిశీలితే తన పార్టీ విలీనం, పొత్తులపై ఆమె ఇంకా స్పష్టంగా లేకపోయినప్పటికీ రాజకీయంగా ఆమె పార్టీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధంతో పాటు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒంటరి పోరాటం చేయడానికి అవసరమైన యంత్రాంగం, క్యాడర్ షర్మిల పార్టీకి లేదు. ఆర్దికంగా కూడా షర్మిల ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇటువంటి పరిస్థితులలో మరోకొద్దీ నెలల్లో ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి సహేతుకమైన ప్రతిపాదన వస్తే షర్మిల కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని స్పష్టం అవుతుంది.

అయితే షర్మిలను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకుల దృష్టి కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని, ఆమెను ముందు పెట్టి రాజకీయంగా మనుగడ సమస్య ఎదుర్కొంటున్న ఆంధ్ర ప్రదేశ్ లో తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారని ఈ సందర్భంగా తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles