వైసీపీ స్టిక్కర్ పీకేసిన కుక్కపై పోలీసులు `కుట్ర’ కేసు

Saturday, November 16, 2024

2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది అంటూ `కోడి కత్తి’ కేసు ద్వారా విశేషంగా రాజకీయ ప్రయోజనం పొందిన వైసిపి నేతలు 2024 ఎన్నికల ముందు కూడా అటువంటి మరో `కుట్ర కేసు’ కోసం అన్వేషిస్తున్న ట్లు కనిపిస్తున్నది. 

కోడి కత్తి కేసులో కుట్ర కోణం గురించి లోతుగా దర్యాప్తు చేయాలని స్వయంగా జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఎన్ఐఎ కోర్టులో పిటీషన్ వేసిన మూడు రోజులకే ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని ఎన్ఐఎ కోర్టుకు స్పష్టం చేసింది. పైగా, ఈ కేసులో మరింకా విచారణ అవసరం లేదని, సీఎం జగన్ పిటీషన్ ను కొట్టిపారవేయమని కూడా సూచించింది.

ఈ కుట్ర కోణం అబద్దమని వెల్లడైన రోజుననే, విజయవాడలోనే మరో సరికొత్త కుట్ర కేసును పోలీసులు నమోదు చేయడం గమనార్హం. ఈ సారి ఒక కుక్కపై ఈ కేసును నమోదు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇళ్లకు అంటిస్తున్న స్టిక్కర్లలో ఒక దాన్ని విజయవాడలో ఓ కుక్క చింపేయడం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఓ ఇంటి గోడకు ఉన్న స్టిక్కర్‌ను ఆ కుక్క పీకేసింది. దాన్ని వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది.

విజయవాడలో కొంతమంది మహిళలు ఆ వీడియో ఆధారంగా నున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును  సీఐ స్వీకరించారనీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారని వారు తెలిపారు. కుక్కలన్నాక  స్టిక్కర్ల వంటి వాటిని పీకేయడం, బట్టల లాంటి వాటిని చింపేయడం సర్వసాధారణం. కానీ ఈ ఘటన వెనక కుట్ర ఉందని ఆ మహిళలు ఆరోపిస్తున్నారు.

వీడియో ద్వారా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పరువు పోతోందనీ, అలా జరగకూడదన్న ఉద్దేశంతో, ఇకపై ఎక్కడా కుక్కలు జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లు పీకకుండా ఉండాలన్న ఉద్దేశంతో తాము ఫిర్యాదు ఇచ్చినట్లు మహిళల్లో ఒకరు తెలిపారు. ఆ కుక్కతో పాటు, ఆ కుక్క వెనుక ఉన్నవారిని కూడా అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఫిర్యాదు చేసిన మహిళలు ఏ పార్టీకి చెందినవారో అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles