జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. కొత్త పోస్టులు, వెకిలి అసభ్య బూతు పోస్టులు పెట్టడానికి జంకుతున్నారు.. భయపడుతున్నారు. లెంపలే వేసుకుంటున్నారు. జీవితంలో మళ్లీ ఇలాంటి తప్పులు చేయం.. మమ్మల్ని క్షమించి వదలిపెట్టండి అని వేడుకుంటున్నారు. కాగా, ఇన్నేళ్లపాటూ కష్టపడి తయారుచేసిన సోషల్ మీడియా సైకోలు ఇలా మెత్తపడిపోవడం పార్టీకి నచ్చడం లేదు. అందుకే జగన్ గానీ, ఆయన సహచరుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి గానీ.. వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు కొత్త పోస్టులు పెట్టకపోతే.. తమ పప్పులుడకవనే భయంతో.. మీరు ధైర్యంగా పోస్టులు పెట్టండి మీమీద కేసులు నమోదు అయితే మేం చూసుకుంటాం. సెంట్రల్ ఆఫీసులో ఒక న్యాయసేవా విభాగం ఏర్పాటుచేశాం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. కానీ.. వాస్తవంలో.. సోషల్ మీడియా సైకోలపై బుక్ అయిన కేసుల్లో వారిని బయటకు తీసుకురావడానికి జరుగుతన్న ప్రయత్నాలు.. వైసీపీ న్యాయవిభాగం వారి సలహాలు, సేవలు కోర్టు ఎదుట తుస్సుమంటున్నాయి. అలాంటిదే ఒక ఉదాహరణ అమరావతిలో జరిగింది.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో తన కొడుకు పప్పులు వెంకటరామిరెడ్డిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులు ఎలాంటి కారణాలు చెప్పలేదని, వినుకొండ మేజిస్ట్రేటు విధించిన రిమాండు కూడా చెల్లుబాటు కాదని అతని తండ్రి చలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వెంకటరామిరెడ్డి అరెస్టును అక్రమ అరెస్టుగా ప్రకటించేందుకు హైకోర్టు నిరాకరించింది.
తన కొడుకును అక్రమంగా పోలీసులు నిర్బంధించారని ఆరోపించడం మాత్రమే కాకుండా.. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే.. గత పదేళ్లలో నిందితుడు ఇదేతరహా నేరాలకు పాల్పడి, ఆ కేసుల్లో కనీసం రెండు చార్జిషీట్లను కోర్టు పరిగనణలోకి తీసుకునే ఉండాలనే నిబంధనను కూడా నిందితుడు తరఫు వారు వినిపంచారు. అయితే హైకోర్టు దీనిని తోసిపుచ్చింది. రిమాండు రిపోర్టులో స్పష్టంగా కారణాలు పేర్కొన్నారని దీనిని అక్రమ అరెస్టు అనడానికి వీల్లేదని, సెక్షన్ 111 వర్తింపున సబబేని పేర్కొంది.
చూడబోతే.. సజ్జల భార్గవ్ వంటి పెద్దలకు వైసీపీ అందిస్తున్న న్యాయసాయం ఒక తీరుగా, ఇలాంటి చిన్నస్థాయి సైకోలకు అందిస్తున్న న్యాయసహాయం ఇంకో తీరుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సైకోలు కేసుల్లో మరింతగా కూరుకుపోతున్నారని పలువురు అంటున్నారు.
‘‘వైసీపీ న్యాయసహాయం తుస్సుమంటోంది!’
Thursday, December 19, 2024