వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. టిడిపి అనురాధ గెలుపు!

Monday, December 23, 2024

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకున్నట్లుగానే అధికార పక్షం వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తలిగింది. అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా టిడిపి నిలబెట్టిన అభ్యర్థి, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఆమెకు టిడిపికి గల సంఖ్యా బలం కన్నా నాలుగు ఓట్లు అదనంగా రావడంతో 23 ఓట్లతో గెలుపొందారు.

కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. గెలుపొందేందుకు 22 ఓట్లు సరిపోయినా, ఆమెకు ఒక ఓటు అదనంగా వచ్చింది. టిడిపి బలం 23 అయినప్పటికీ, నలుగురు టిడిపి ఎమ్యెల్యేలు వైసీపీతో ఉంటూ ఉండడంతో బలం 19కి పడిపోయింది.

అయితే వైసిపి అసమ్మతి ఎమ్యెల్యేలు ఇద్దరు – ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి `ఆత్మప్రబోధానుసారం’ ఓటువేశామని చెబుతూ బహిరంగంగానే టిడిపికి ఓటు వేసిన్నట్లు సంకేతం ఇచ్చారు.  దానితో టిడిపి అభ్యర్ధికి ఓటు వేసి మరో ఇద్దరు వైసీపీ సభ్యులు ఎవ్వరనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ అంశం వైసిపి నేతలను గగుర్పాటుకు గురిచేస్తున్నది. మొత్తం 175 మంది ఎమ్యెల్యేలు ఓటువేయగా, అందరి ఓట్లు చెల్లుబాటయ్యాయి. గతంలో ఎప్పుడో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన టీడీపీ సభ్యుడు గంటా ఆనందరావు రాజీనామాను స్పీకర్ ఈ రోజు ఆమోదించారని తొలుత ప్రచారం జరిగింది.

ఇది కేవలం టిడిపి సంఖ్యాబలం తగ్గిందనే టిడిపి అభ్యర్ధికి ఓటు వేయడానికి సిద్దమైన వైసీపీ అసమ్మతి ఎమ్యెల్యేలను కట్టడి చేయడం కోసం చేస్తున్న ప్రచారం అని గంటా స్పష్టం చేశారు. ఒకసారి ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత ఇప్పుడు రాజీనామా ఆమోదించినా చెల్లదని స్పష్టం చేశారు.

ఏదేమైనా గెలుపొందడానికి ఒక ఓటు తక్కువగా ఉన్న అనురాధ మరో ఓట్ ఎక్కువగా వచ్చి గెలుపొందడం టిడిపి శ్రేణులలో సంబరాలు నింపుతుంది. ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గాల నుండి ముగ్గురు టిడిపి అభ్యర్థులు గెలుపొందిన ఉత్సాహంతో ఉన్న పార్టీ వర్గాలకు అనూహ్యంగా వైసిపి నుండి క్రాస్ ఓటింగ్ తో అనురాధ గెలుపొందడం మరింతగా జోష్ కలిగిస్తుంది.

అనురాధ గెలుపొందడంతో వైసిపి అధికార అభ్యర్థులలో ఎవ్వరో ఒకరు ఓడిపోక తప్పదు. ఎవ్వరు ఓటమి చెందుతున్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 8 మంది అభ్యర్థులలో కేవలం టిడిపి అభ్యర్థి అనురాధపై 23 ఓట్లు రాగా, ఐదుగురు వైసిపి అభ్యర్థులకు 22 ఓట్లు చొప్పున వచ్చి గెలుపొందారు. మరో ఇద్దరికీ – జయమంగళం, కోలా గురువులులకు 21 చొప్పున ఓట్లు వచ్చాయి. వారిలో ఒకరు ఓటమి చెందుతారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles