వైసిపి ఎమ్యెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చిన టీడీపీ

Tuesday, November 5, 2024

ఎమ్యెల్యేల నుండి ఏడుగురు ఎమ్యెల్సీలకు జరిగే ఎన్నికలలో తమకున్న సంఖ్యాబలంను బట్టి ఏకగ్రీవంగా ఎన్నికవుతారనుకొని నామినేషన్లు కూడా దాఖలు చేసిన తర్వాత టిడిపి పి అనురాధను అభ్యర్థిగా పోటీలకు నింపడంతో పాటు తమకు ఓటువేసేందుకు పలువురు వైసిపి ఎమ్యెల్యేలు టచ్ లో ఉన్నారంటూ టిడిపి వైసిపి శిబిరంలో బాంబు పేల్చింది.

టిడిపికి చెందిన నలుగురు ఎమ్యెల్యేలు ప్రస్తుతం వైసిపి శిబిరంలో ఉండడంతో టిడిపి అభ్యర్థి గెలుపొందడం అసాధ్యం కాగలదు. కానీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజుననే తమ అభ్యర్థి గెలుపొందుతుందని ధీమా అవ్యక్తం చేస్తూ మాజీ  హోమ్ మంత్రి చినరాజప్ప ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైఎస్సార్‌సీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు.

అందుకు బలం చేకూరి స్తున్నట్లు, సమావేశాలు ప్రారంభమైన రోజే  గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ సభ్యుల వైపు కూర్చోవటం అధికార పార్టీని ఖంగారుకు గురిచేస్తున్నది. అనం రామనారాయణ రెడ్డి  కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే.

ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండడంతో పార్టీ అధిష్టానం ఆయనకు వెంకటగిరి వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నేదురుమల్లి వారసుడిని నియమించింది. దానితో వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేయవచ్చనే సంకేతాలు ఇచ్చారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహితం పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. మరికొందరు ఎమ్యెల్యేలు సహితం పార్టీ పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మరొ కొందరికి వచ్చే ఎన్నికలలో సీట్ ఇచ్చే ప్రసక్తి లేదని స్వయంగా సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు. ఈ  పరిణామాలు ఎమ్యెల్సీ ఎన్నికలపై పడే ప్రమాదముందని చినరాజప్ప ప్రకటన అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నది.

టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, పార్టీకి దూరంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు గెలిచింది టీడీపీ గుర్తుపై కాబట్టి తమ అభ్యర్థికి ఓటేయాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ ఆ నలుగురు తమకు ఓటేయకుంటే వైఎస్సార్‌సీపీ నుంచి అంతకంటే ఎక్కువ మందే తమకు ఓటేస్తారని హెచ్చరించారు.

చాలా మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. అసెంబ్లీ పెట్టాలంటేనే జగన్ భయపడుతున్నారని.. సభలో 15కు పైగా ప్రజా సమస్యలు లెవనెత్తేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చివరి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles