వైసిపిలో లోక్ సభకు పోటీకి నేతల విముఖత!

Friday, November 22, 2024

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అటు వైసీపీలో, ఇటు టిడిపిలో ప్రతి నియోజకవర్గంలో పలువురు పోటీ పడుతున్నప్పటికీ లోక్ సభకు పోటీ చేసే విషయంలో చాలామంది నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వైసిపిలో అయితే ఈ పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 25 నియోజకవర్గాలకు ఉండగా ఆ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. 

వారిలో ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన వారెవ్వరూ తిరిగి పోటీకి ఆసక్తి చూపడం లేదు. సగం మందికి పైగా అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకొక్క అభ్యర్థి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం, లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు సహితం భారీగా ఎన్నికల వ్యయం భరించాల్సి రావడంతో వెనుకడుగు వేస్తున్నారు.

ఎంపీగా గెలిచినా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై నోరు తెరిచి మాట్లాడేందుకు వీలు లేకుండా కట్టడి చేస్తున్నారు. అంతేకాదు, సొంతంగా కేంద్ర మంత్రులను గాని, ఉన్నతాధికారులను గాని ఢిల్లీలో కలవొద్దని ఆదేశాలు జారీ చేశారు. కలవాలంటే పార్లమెంటరీ పార్టీ నేతలతో కలిసి మాత్రమే కలవాలి. అంటే వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి సంబంధాలు ఎంపీలు పెట్టుకోవడానికి వీల్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఢిల్లీలో ఎంపీల కదలికలపై రాష్త్ర నిఘా వర్గాలు కన్నేసి ఉంచుతున్నాయి. మరోవంక నియోజకవర్గంలో ఎమ్యెల్యేలదే రాజ్యంగా ఉంటుంది. పలువురు ఎమ్యెల్యేలు తమ ఎంపిలను అసలు పట్టించుకోవడం లేదు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. పార్టీ వ్యవహారాలలో సహితం వారి జోక్యం లేకుండా కట్టడి చేస్తున్నారు. 

అందుకనే భారీగా ఖర్చు పెట్టుకొని, ఢిల్లీలో ఉత్సవ విగ్రహం మాదిరిగా అమిగిలిపోవడం కన్నా ఎమ్యెల్యేగా గెలుపొందితే అవకాశం వస్తే మంత్రి కావచ్చు. లేకపోయినా నియోజకవర్గంలో ఎదురులేని రాజు మాదిరిగా అధికారం చెలాయించవచ్చు. అందుకనే ఎమ్యెల్యేగా పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దానితో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ భారీ కసరత్తు చేయాల్సి ఉంది.

బీశెట్టి స‌త్య‌వ‌తి, గొట్టేటి మాధ‌వి, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, వంగా గీత అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్ల‌మెంటుకు పోటీ చేసేది లేద‌ని తేల్చి చెప్పిన్నట్లు తెలుస్తున్నది.   గత ఎన్నికలలో టిడిపి గెలుపొందిన గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళంలలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డిలను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వంగా గీత వంటి వారు సహితం అసెంబ్లీకి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వంటి వారు నియోజకవర్గం మార్చాలని కోరుతున్నారు.

కాపు నేత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరితో కాకినాడ నుండి పోటీ చేయించాలని అనుకొంటున్నారు. అయితే ఆయన తనకన్నా, తన కుమారుడికి పిఠాపురం సీట్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వినికిడి. ఇక్కడి నుండి వంగా గీత పోటీచేయాలి అనుకొంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles