విస్మయంకు గురిచేస్తున్న హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్ 

Friday, January 17, 2025

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ విచారణకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో జరిగిన తీరు పలువురికి విస్మయంకు గురిచేస్తున్నది. ఈ పిటీషన్  విచారించిన బెంచ్ కు అది ఎట్లా వస్తుంది అన్న విషయమై ఒక వంక సందేహాలు వ్యక్తం కాగా, మరోవంక అవినాష్ న్యాయవాది వాదనలు మరిన్ని ప్రశ్నలకు దారితీస్తున్నాయి.

పార్లమెంట్ సభ్యులు దాఖలు చేసే కేసు పిటీషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారిస్తుందన్న నియమావళికి భిన్నంగా ఈ పిటిషన్ మరొక బెంచ్ కు వెళ్లడం వెనుక మర్మం ఏమిటో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఆంధ్ర, తెలంగాణ పోలీసులు కలసి కుట్ర చేసి తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ, తాను  పిటిషన్ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు విచారణకు వెళ్ళిందని నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.

తనకు ఒక నిబంధన, అవినాష్ రెడ్డికి మరొక నిబంధనా? ఏమిటని ఆయన ప్రశ్నించారు.  అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ లో అత్యవసరంగా కేసు మూవ్ చేయగా రోస్టర్ విధానంలో ఈ కేసు సంబంధిత బెంచ్ పైకి వెళ్లాల్సి ఉండగా, మరో బెంచ్ పైకి రావడం పట్ల  స్వయంగా ఆ న్యాయమూర్తి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు.

అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన శాయశక్తులను ఒడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో సిబిఐ 161 కింద నోటీసులు ఇచ్చి, అవినాష్ రెడ్డి ని విచారణకు పిలిచిన సమయంలో అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకోవద్దని కోరడం మరింత విస్మయంకు గురిచేస్తున్నది. ఈ మాట చెబుతూనే గతంలో సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లను కోర్టుకు సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరారు.

విచారణ సందర్భంగా  సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి దృష్టికి కొన్ని ఫోన్ నెంబర్లను తీసుకువచ్చి, ఈ ఫోన్ నెంబర్లు ఎవరివని ప్రశ్నించగా వారెవ్వరో చెప్పారని, దాని ప్రకారమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ, ఆయన భారతి వ్యక్తిగత సహాయకుడులను కూడా పిలిపించి సిబిఐ విచారించడం తెలిసింది. ఈ పేర్లు బైటకు రావడంతో మొదటిసారిగా వివేకానందరెడ్డి హత్యకేసులో తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయం గురించిన కధనాలు వెలుగులోకి వస్తున్నాయి.

అందుకనే సిబిఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాధానం తెలిసి సీఎం జగన్  కోపోద్రిక్తులయి ఉంటారని భావిస్తున్నారు. పైగా, అవినాష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే సిబిఐ ఆయనను అరెస్ట్ చేయవచ్చని స్పష్టం కావడంతో,  తన స్టేట్మెంట్ సిబిఐ అధికారులు మార్చే అవకాశం ఉందనే కొత్త వాదన ఆయన తెరపైకి తెచ్చారని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఈ కేసును ఎం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మార్చి వేగంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత కూడా, అవినాష్ రెడ్డి అత్యవసర పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు వాదనలు వినడం పట్ల కూడా రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles