విశాఖ నుంచి మూడో విడత పవన్ వారాహి విజయయాత్ర

Friday, May 17, 2024

2024 ఎన్నికలకు సన్నగా జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి విజయయాత్రను ఇప్పటివరకు రెండు విడతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను విశాఖపట్నం నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్రను విజయవంతం చేయడంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతలుగా నిర్వహించిన వారాహి యాత్ర విజయవంతమైందని మనోహర్ వెల్లడించారు. తొలి రెండు విడతలను మించిపోయేలా విశాఖ నగరంలో పవన్ వారాహి యాత్ర ఉండాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల స్పష్టం చేశారు. జనసేన నేతలు, వీర మహిళలు, జనసైనికులు సమష్టిగా కృషి చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

రెండో విడతలుగా జరిగిన ఈ యాత్ర జనసేన నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపింది. గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉండటంతో ప్రజలకు నుంచి వారాహి విజయ యాత్రకు భారీ  స్పందన వచ్చింది. వచ్చే ఎన్నికలలో ఓ బలమైన పక్షంగా జనసేన నిలబడగలదనే భరోసాను ఆ పార్టీ శ్రేణులకు కలిగించింది. దీంతో మూడో విడత వారాహి యాత్ర చేపట్టాలని పవన్ నిర్ణయించారు.

విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్ ఆగస్టు 15 తర్వాత జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంతో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్‌గా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. 

ఇటీవల వారాహి యాత్రలో వాలంటీర్లు, మహిళల మిస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అలాగే అంతకుముందు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. దీంతో పాటు పొత్తులపై కూడా పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు.

విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని, త్వరలోనే అక్కడికి తాను మకాం మార్చుతానంటూ జగన్ పలుమార్లు తెలిపారు. అలాగే విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని, రిషికొండను మొత్తం తవ్వేశారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

 దీంతో విశాఖ రాజధాని అంశం గురించి పవన్ మాట్లాడే అవకాశముంది. ఇక పవన్‌పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎప్పుడూ ఏవోక విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో విశాఖ నుంచి జరిపే వారాహి యాత్రో అమర్‌నాథ్‌ను పవన్ టార్గెట్ చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, వారాహి యాత్ర మూడో విడత సందర్భంగా విశాఖలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే జనవాణి కార్యక్రమం కూడా ఉంటుందని నాదెండ్ల తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles