వివేకా హత్యకేసు నుండి దృష్టి మళ్లించడం కోసమేనా `స్కిల్’ కుంభకోణం!

Wednesday, January 22, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దర్యాప్తు పతాక స్థాయికి చేరుకోవడం, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసును తెరపైకి తెచ్చి, అరెస్టులు అంటూ హడావుడి చేస్తున్నారు.

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.200కోట్ల పైచిలుకు అవినీతి జరిగిందని, ఇప్పటికే ఈడీ విచారణలో పది మంది అరెస్టయ్యారని, రేపో మాపో లోనికి వెళ్లేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నారని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తాజాగా పేర్కొనడం గమనార్హం.

సీఐడీ ఈ కేసు విచారణకు స్వీకరించి 15 నెలలవుతోంది. ఇప్పటి దాకా ఈ కేసులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేయలేదు. ఎవరి పాత్ర ఏమిటో స్పష్టంగా నిర్ధారించ లేకపోయింది.  ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు మూలాన పడింది.  అయితే అకస్మాత్తుగా ఈడీ అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం, వారిని ఈడీ కాకుండా ఏపీ సిఐడి విచారణ చేబట్టడం గమనిస్తే ఇదంతా లోతయిన కుట్రగా స్పష్టం అవుతుంది.

ఇదంతా టిడిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించే కుట్ర అంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేశారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో 5 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పంద పత్రాలను విడుదల చేస్తూ గతంలో గుజరాత్‌ సర్కార్‌తో సీమెన్స్, డిజైన్ టెక్ చేసుకున్న ఒప్పందం పత్రాల వివరాలను విడుదల చేశానని నరేంద్ర చెప్పారు.

స్కిల్‌ డెవలలపలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, అందులో ఒక భాగస్వామిగా ఉన్న సీమె న్స్‌ కంపెనీ పేరు బయటకురాకుండా ఎందుకు దా స్తోందని నరేంద్ర ప్రశ్నించారు. ఇక్కడ అమలు చేసిన నమూనాలోనే ఇదే ప్రాజెక్టును దేశంలో ఐదు రాష్ట్రా ల్లో అమలు చేశారని, ఒక్క ఈ రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వం దీనిపై వివాదం సృష్టించి హడావుడి చేస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీలో ఏ ఒక్క నేత ఖాతాలోకైనా ఒక్క రూపాయి వచ్చిందేమో నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు.

కాగా, ఈ కేసులో తమకు సన్నిహితులైన వారిని వదిలివేసి, టిడిపికి సన్నిహితులని భావించినవారిపై కక్షసాధింపు చర్యలకు దిగడం కనిపిస్తున్నది. సీమెన్స్‌ ప్రాజెక్టులో ప్రభుత్వం తరపున కార్యదర్శిగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, ఆనాటి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణపై కేసులు నమోదు చేసింది.

ఈ ప్రాజెక్టు ఒప్పందంలో ప్రభుత్వం తరపున స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి సంతకాలు చేశారు. గంటా సుబ్బారావు సాక్షి సంతకం మాత్రమే చేశారు. కానీ, ఈ కే సు విచారణలో ఇప్పటి వరకు ప్రేమ్‌చంద్రారెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనేలేదు.

కానీ అదే కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణపై కేసు నమెదు చేసి అరెస్ట్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడనే పేరు ఉండటంతో కరోనా సమయంలో ఆయన్ను అరెస్ట్‌ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సీమెన్స్‌ ప్రాజెక్టులో ఒప్పందాలు, నిధుల విడుదల ప్రక్రియ అంతా అయ్యాక చివరిలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఎండీగా వచ్చిన శ్రీకాంత్‌ అర్జా ఇప్పుడు  విచారణ ఎదుర్కొంటున్నారు.

కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వ్యవహారంలో మాజీ ఎండి ఆర్జా శ్రీకాంత్‌ను విచారణ పేరుతో సిఐడి హింసపెడుతోందని టిడిపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి ఓ రిటైర్డ్‌ ఐఎఎస్‌ను ఢిల్లీ నుండి తీసుకువచ్చి కొడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీనియర్‌ ఐఎఎస్‌ శ్రీకాంత్‌ను ప్రభుత్వం వేధిస్తోందని, పోలీసు వ్యవస్థను దిగజార్చి కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. సిఐడిని అడ్డంపెట్టి వేధించే ఇలాంటి సిఎంను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఏం చెబుతుందో జగన్‌కు వినపడటం లేదా? అని ప్రశ్నించారు.

గత టిడిపి ప్రభుత్వంలో రూ.3 లక్షల కోట్లు అక్రమాలు జరిగాయని ఆరోపించిన జగన్‌ ఒక్కటైనా నిరూపించారా? అని కన్నా ప్రశ్నించారు. శ్రీకాంత్‌ సుదీర్ఘ కాలం వివిధ శాఖల్లో పని చేశారని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ఆయన  చెప్పారు. ఆయన మంచి అధికారని ఈ ప్రభుత్వమే ప్రశంసించిందని గుర్తు చేశారు.

సిమెన్స్‌ కంపెనీ మంచి ఉద్దేశంతో విద్యార్థులకు శిక్షణిచ్చేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. తనను వ్యతిరేకించిన వారందరిని జైలుకు పంపాలన్న శాడిజం జగన్‌లో కనిపిస్తోందని కన్నా దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలని జగన్‌ లక్ష్యంగా పెట్టుకుని అడ్డువచ్చిన అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ భాస్కర్‌ను ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోయిడాలో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు ఇవ్వాలంటూ విజయవాడ సీఐడీ కోర్టును ఆశ్రయించారు. అయితే, భాస్కర్‌ రిమాండ్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. దానితో  హైకోర్టులో సీఐడీ శుక్రవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కేసు మంగళవారంకు వాయిదాపడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles