వివేకా హత్యకేసులో వైఎస్ భారతికి నోటీసులు ఇస్తారా!

Friday, November 22, 2024

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచడంతో దర్యాప్తు జరుగుతున్న తీరుకూడా మారుతున్నది. ఇప్పటి వరకు సీఎం జగన్ కు వరుసకు తమ్ముడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక నిందితుడని భావిస్తుండగా, అవినాష్ ను సిబిఐ విచారించిన అనంతరం ఇప్పుడు దర్యాప్తు సీఎం అధికార నివాసం తాడేపల్లి ప్యాలెస్ వైపు మళ్లింది.

తాజాగా, సీబీఐ నేరుగా సీఎం వైఎస్ జగన్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్‌లను శుక్రవారం విచారించింది.  కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో ఆరు గంటలకు పైగా సీబీఐ విచారణ జరిగింది. మొదట కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు, ఆ తర్వాత నవీన్‌ను ప్రశ్నించింది.

ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా వీరిద్దరినీ ప్రశ్నించి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అవినాష్ ఫోన్ కాల్ డేటాపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. హత్య జరిగిన రోజున వీరిద్దరి ద్వారా అవినాష్ జగన్, భారతిలతో మాట్లాడినట్లు కనుగొన్నారు.

నవీన్‌ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్‌ నంబర్‌కు అవినాష్‌ ఎక్కువగా కాల్‌ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు కృష్ణ మోహన్‌ రెడ్డి సీబీఐ నోటీసులు ఇచ్చింది.  భారతికి వచ్చిన కాల్‌ ఆధారంగా నవీన్‌ను ప్రశ్నించారు. దానితో, రాబోయే రోజులలో వైఎస్ భారతిని కూడా విచారణకు పిలుస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా గత నెల 28న ప్రశ్నించిన విషయం తెలిసిందే. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ నేతృత్వంలోని బృందం ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో సుమారు నాలుగున్నర గంటలపాటు అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించింది.

అధికారులు పదుల సంఖ్యలో అడిగిన ప్రశ్నల్లో చాలా వరకు ఆయన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో ఆధారాల ట్యాంపరింగ్‌, సాక్ష్యాల విధ్వంసంపైనే సీబీఐ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

కేసు నమోదు తర్వాత సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో లభించిన ఆధారాలు, అంతకుముందే ‘సిట్‌’ పోలీసులు జరిపిన దర్యాప్తు ప్రాతిపదికన ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles