వివేకా హత్యకేసులో నేడే సిబిఐ మధ్యంతర ఛార్జ్ షీట్ !

Sunday, January 19, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తు పూర్తిచేసి, జూన్ 30 లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన దృష్ట్యా సిబిఐ ఈ నిర్ణయం తీసుకోండి.

దానితో ఇప్పుడు సిబిఐ ఛార్జిషీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యంతర ఛార్జిషీటులో జగన్, అవినాష్ రెడ్డి పేర్లు ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. అదే జరిగితే ఈ కేసు రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది. ఆ తర్వాత, దర్యాప్తునకు మరింత గడువు కావాలని జులై3వ తేదీనే సుప్రీంకోర్టును కోరాలని సిబిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జులై 3న సిజెఐ ధర్మాసనం ముందు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ సిబిఐ ఛార్జిషీటులో ప్రస్తావించనుంది. కుట్ర కోణం వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు కావాలని సిబిఐ సుప్రీంకోర్టును కోరనుంది.

వివేకా హత్య కేసులో కడప వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. తనతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్‌ను తీసుకు వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకురావాలని శనివారమే అధికారులు చెప్పారు. దీంతో డాక్యుమెంట్స్‌తో సిబిఐ కార్యాలయానికి వచ్చిన ఆయన ఇరవై నిమిషాలు ఉండి తిరిగి వెళ్లిపోయారు.

 కాగా అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సిబిఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె డా. సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే. ఆ పిటీషన్ లో సుప్రీంకోర్టు విచారణపై సీబీఐ దాఖలు చేస్తున్న మధ్యంతర ఛార్జ్ షీట్ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles