విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు!

Monday, December 23, 2024

2019లో పరాజయం తర్వాత కేంద్ర ప్రభుత్వంపై మౌనంగా  ఉంటూ వస్తున్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారిగా గళం విప్పారు. విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీశారు. మొన్నటి వరకు బిజెపితో పొత్తు అవకాశలకోసం ఎదురుచూస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నల్టు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేయడంతో తన ధోరణి మార్చుకొన్నల్టు కనిపిస్తున్నది.

పైగా, తెలుగు ప్రజలలో ప్రధాని మోదీ పట్ల తీవ్ర ఆగ్రవేశాలు నెలకొన్నట్లు కర్ణాటక ఎన్నికలు స్పష్టం చేశాయి. దానితో ఇక వైసీపీ, బీజేపీలపై ఒక పట్టు పట్టాలని సిద్ధపడినట్లు, వారు తెలుగు ప్రజలకు చేస్తున్న ద్రోహాలను ప్రశ్నించాలని నిర్ధారణకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది.  రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కాలేదని గుర్తు చేశారు
రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం చట్టంలో పొందుపరిచిందని చెబుతూఈ చట్టం కాలపరిమితి మరో ఏడాదితో ముగుస్తుందని గుర్తు చేశారు. చట్టంలోని హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా సిఎం జగన్‌ రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు.

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ మెట్రోరైల్‌, వైజాగ్‌-చెనైు కారిడార్‌ గురించి కనీసం మాట్లాడటం లేదని మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి కేసుల మాఫీ కోసం తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

 కేసులపై కేంద్రంతో లాలూచీ పడ్డారని, రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.  బహుశా చంద్రబాబు నాయుడు ఈ విషయమై మొదటిసారిగా వైఎస్ జగన్ ను నిలదీయడం ద్వారా ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని చంద్రబాబు ప్రశ్నించినట్లయినది.

శివరామకృష్ణన్‌ కమిటీ సూచన మేరకు రాజధానిగా ప్రకటించిన అమరావతికి అసెంబ్లీ సాక్షిగా వైసిపి అంగీకరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుందని విమర్శించారు. తొమిదేళ్లు గడిచినా రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

విభజన తరువాత రూ.16 వేలకోట్ల లోటు బడ్జెట్‌, రూ.1.10 లక్షల కోట్ల అప్పు, 22.5 మిలియన్‌ యూనిట్ల (ఎంయు) విద్యుత్‌ కొరతతో పాలన ప్రారంభించానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికే పోలవరం పూర్తయ్యేదని, ఇప్పుడు పూర్తికావడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియని దుస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

సిగ్గులేకుండా ప్రాజెక్టు మొదటి దశను 2025 నాటికి పూర్తిచేస్తామని చెబుతున్నారని విమర్శించారు. ప్రతి ఏటా జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తాను జరిపానని, ఇప్పుడు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని దుస్థితిలో సిఎం జగన్‌ ఉన్నారని విమర్శించారు.

సంక్షేమం, అభివృద్ధి ప్లస్‌ తాను ప్రకటించిన మేనిఫెస్టోను బిసి బెల్‌బాత్‌, పులిహోరతో పోల్చారని, వీటిలో ఒకటి రుచిగా ఉంటుందని, మరొకటి పౌష్టికాహారం ఇస్తుందని తెలిపారు. దీని అర్థం మేనిఫెస్టో బాగుందని జగనే ఒప్పుకున్నారని చురకలు అంటించారు. ఏదేమైనా జగన్, మోదీ బంధాన్ని బట్టబయలు చేసేందుకు టిడిపి పూనుకున్నట్లు కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles