విచారణకు అవినాష్ గైరాజర్ … తిరిగి 19న విచారణ!

Saturday, January 18, 2025

సుమారు మూడు వారాల వ్యవధి తర్వాత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం విచారణకు హాజరు కమ్మనమని సీబీఐ నోటీసు పంపినా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు.  దానితో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా మరో నోటీసు పంపారు.

తొలుత అత్యవసర పనుల వల్ల విచారణకు హాజరుకాలేనని..,  నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐను కోరుతూ ఈమెయిల్ ద్వారా ఎంపీ అవినాశ్ లేఖ పంపారు. అయితే తొలుత ఎంపీ విజ్ఞప్తిని సీబీఐ  ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఆ విధమైన ఆదేశాలు సిబిఐ జారీచేసినా ఖాతరు చేయకుండా అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుండి పులివెందులకు తిరిగి వెడుతుండగా, కొద్దిసేపటికే  అవినాశ్ లేఖపై సీబీఐ మరోసారి స్పందించింది. ఈ సారి సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈనెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.

గతంలో  కూడా సిబిఐ నోటీసు పంపగానే అవినాష్ రెడ్డి ఎప్పుడూ వెంటనే హాజరుకాలేదు. వ్యవధి కావాలని లేఖ వ్రాయడమో లేదా స్టే కోసం హైకోర్టును ఆశ్రయించడమో చేస్తూ వచ్చారు.  ఇప్పటికి ఏడుసార్లు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారణ జరిపింది.

మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసు అందుకొగానే సోమవారం హైదరాబాద్ కు వచ్చిన అవినాష్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరు కాకుండానే హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరగా, దారి మధ్యలో ఉండగా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తేనే చాలా విషయాలు తెలుస్తాయని ఇప్పటికే సీబీఐ హైకోర్టులో ఇటీవల కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ అరెస్టు విషయంలో సీబీఐ ఆచితూచి వ్యవహరిస్తుంది.

20 రోజుల పాటు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవలేదు. తాజాగా నిన్న నోటీసులు జారీ చేయడంతో అరెస్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకాలేదు. దీంతో సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.  విచారణకు హాజరుకాకుండా పులివెందులకు అయలుదేరిన అవినాష్ రెడ్డి అప్పటికే  పులివెందులలో ఈరోజు జరగబోయే కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకోవడం గమనార్హం.

జూన్ నెలాఖరు లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. కేసు దర్యాప్తు అధికారిని మార్చిన తర్వాత మొదటి నుంచి కేసు విచారణ చేస్తున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో అవినాష్‌అరెస్ట్ తప్పదని ప్రచారం జరిగింది

.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles