వామ్మో బన్నీ తో సినిమా చేయడానికి ఆ దర్శకుడు అంత అడుగుతున్నాడా

Thursday, December 26, 2024
వామ్మో బన్నీ తో సినిమా చేయడానికి ఆ దర్శకుడు అంత అడుగుతున్నాడా!

రాజారాణి సినిమాతో దర్శకుడిగా మారాడు అట్లీ…. మొదటి సినిమానే సూపర్ హిట్‌ కావడంతో రెండో సినిమానే విజయ్ ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా తెరి సినిమా చేసి హిట్‌ కొట్టి , ఆ తరువాత మెర్సల్, బిగిల్‌ వంటి సినిమాలు చేసి వరుస హిట్లు అందుకున్నాడు. ఇలా ఉండగానే షారూక్‌ ఖాన్‌ తో జవాన్‌ అనే సినిమా చేసి పాన్‌ ఇండియా లెవల్లో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నాడు.

చేసినవి తక్కువ సినిమాలే అయినా.. హిట్ల మీద హిట్లు అందుకోవడంతో కోలీవుడ్ లో అతి తక్కువ టైమ్‌ లోనే పెద్ద దర్శకుల చెంత కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్‌, పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ జవాన్‌ విజయం సాధించడంతో బన్నీ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే వీరి ప్రాజెక్ట్‌ కి సంబంధించిన చర్చలు ఎప్పుడో పూర్తయ్యాయి. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ లో ఉన్నాడు. ఆ షూటింగ్‌ పూర్తి కాగానే అట్లీ తో చేసే సినిమా షూటింగ్‌ లో పాల్గొనేందుకు బన్నీ రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా చూసుకుంటూ అట్లీ బిజీగా ఉన్నాడు.

వచ్చే నెలలో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నాడు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటను వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది. ఈ సినిమా చేసేందుకు అట్లీ డిమాండ్ రెమ్యూనరేషన్‌ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎందుకంటే అట్లీ డిమాండ్‌ చేస్తుంది ఏమి చిన్న చితకా అమౌంట్‌ కాదు… సుమారు 60 కోట్ల రెమ్యునరేషన్‌ అలాగే సినిమా లాభాల్లో కొంత వాటాను కూడా డిమాండ్‌ చేస్తున్నడట.

మరి అట్లీ మార్కెట్‌ అలా ఉంది. ఆయన సినిమాల రికార్డు చూస్తే ఆయన డిమాండ్ కూడా న్యాయంగానే అనిపిస్తుంది. ఇప్పుడు బన్నీ కూడా 120 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్‌ చేస్తున్నాడు. అట్లీ కి నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ ఉండడంతో అతను చేస్తున్న డిమాండ్‌ పెద్ద విషయం కాదని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles