లింగమనేని ఇంటి జప్తుకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!

Saturday, January 18, 2025

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కృష్ణానది తీరంలోని లింగమనేని రమేష్ అతిథి గృహంపై కన్నేసింది. ముందుగా దాని పక్కనే ఉన్న చంద్రబాబు హయాంలో ప్రభుత్వం నిర్మించిన `ప్రజావేదిక’ను కూలగొట్టిన ప్రభుత్వం నదీతీరంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపిస్తూ అతిధి గృహాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు.

అయితే, న్యాయస్థానంలో  విషయంలో ప్రభుత్వ వాదనలు చెల్లుబాటు కావడంతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత ఏపీ సిఐడి అధికారులు దానిని జప్తు చేసే ప్రక్రియ ప్రారంభించారు. తాజాగా ఆ ప్రక్రియకు ఏసీబీ కోర్టు అనుమతి కూడా లభించింది.

ఏపీలో రాజధాని అమరావతి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కృష్ణానది కరకట్టపై విపక్ష చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ అనుమతి ఇవ్వాలని కోరింది.

దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు శుక్రవారం లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధానిలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని రాక సందర్భంగా భారీ ఎత్తున భూములు కేటాయించిందని సీఐడీ ఆరోపిస్తోంది.

అందుకు ప్రతిఫలంగా కృష్ణానది కరకట్టపై ఉన్న తన గెస్ట్ హౌస్ ను లింగమనేని రమేష్ మాజీ సీఎం చంద్రబాబుకు ఇచ్చారని చెబుతోంది. దీన్ని క్విడ్ ప్రోగా పేర్కొంటూ జప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ముందుగా లింగమనేని రమేష్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

అనంతరం గెస్ట్ హౌస్ జప్తు చేసుకునేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది. తద్వారా సీఐడీ వినిపించిన క్విడ్ ప్రోకో వాదనతో ఏకీభవించినట్లయింది. వాస్తవానికి రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం సీఐడీ సాయంతో గత నాలుగేళ్లలో పలు కేసులు నమోదు చేసింది. అయితే ఇందులో ఆశించిన పురోగతి లభించలేదు.

కానీ చంద్రబాబు నివసిస్తున్న గెస్ట్ హౌస్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది. వచ్చే 9 నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న వైసీపీ సర్కార్ తాజా పరిణామాలతో చంద్రబాబుపై పైచేయి సాధించినట్లయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles