రైల్వే స్టేషన్లు మూసేస్తున్నా మాట్లాడని జగన్, చంద్రబాబు

Sunday, December 22, 2024

ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి, జనసేనలతో పాటు బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడమే గాని రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి, విభజన హామీలు అమలు జరపకుండా ఎగగొడుతున్నా నోరు విప్పడం లేదు.

అందుకనే ఏపీలో ఎవ్వరు గెలిచినా, ఎవ్వరు ఓడినా కేంద్రంలో తమకు మద్దతు ఇవ్వాల్సిందే అనే ధీమాలో బిజెపి కేంద్ర నాయకత్వం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.  విశాఖ రైల్ జోన్ కార్యరూపం దాల్చకపోయినా, విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టినా, కడప ఉక్కు కర్మాగారంను గాలికి వదిలేసినా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఇవ్వకపోయినా కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లలో కనిపించడం లేదు.

తాజాగా, విజయవాడ రైల్వే డివిజన్ లో 23 రైల్వే స్టేషన్లను గుట్టుచప్పుడు కాకూండా మూసేసిన ఎవ్వరూ మాట్లాడటం లేదు. దానితో గ్రామీణ ప్రజలకు రైల్వే సదుపాయాలు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వరుసగా వందే భారత రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తుంటే, మరోవైపు చిన్నచిన్న ఊర్లకు వెళ్లే పాసింజరు రైళ్లను తీసేసి ఇప్పుడు ఆ స్టేషన్లను కూడా మూసివేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం పాసింజర్‌ రైళ్ల పేర్లను ఎక్స్‌ప్రె్‌సలుగా మార్చిన ప్రభుత్వం కొన్ని స్టేషన్లలో వాటి హాల్టింగ్‌ ఎత్తివేసింది. ఇప్పుడు ప్రయాణికులు లేరని చెప్పి ఆ స్టేషన్లను మూసివేసింది. విజయవాడ రైల్వే డివిజన పరిధిలో మే, జూన నెలలో 23 స్టేషన్లు గుట్టుచప్పుడు కాకుండా మూసివేశారు.

జిల్లాల మధ్య, ముఖ్యపట్టణాల మధ్య నడిచే పాసింజర్‌ రైళ్లు గ్రామీణ ప్రాంత ప్రజల, విద్యార్థుల, ఉద్యోగుల, కూలీల ప్రయాణావసరాలు తీరుస్తుండేవి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలకు రైళ్లు దూరం కానున్నాయి. కరోనా సందర్భంగా నిలిచిపోయిన రైళ్లను ఆ తర్వాత ఓ పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రె్‌సలు చేసి టికెట్‌ చార్జీలను కూడా పెంచేసింది. 

విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. ప్రయాణికులు తక్కువగా ఉన్నారనే కారణం చూపుతూ వాటిని ఎత్తేశారు. అక్కడ టిక్కెట్లు అమ్మడం ఆపేశారు. గత మే నెల 1న 16 స్టేషన్లను మూసివేస్తూ రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది.

అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద్‌, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద్ద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీవేంకటేశ్వరాపురం, తలమంచి, తెలప్రోలు, వట్లూరు సతాడి, శ్రీవేంకటేశ్వరాపురం, తలమంచి, తెలప్రోలు, వంటి రైల్వే స్టేషన్లను మూసేసారు.

 అక్కడి సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇక జూన్ 1 నుంచి కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం చింతపర్లు స్టేషన్లను కూడా ఎత్తేశారు. రైల్వేని ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం పలు రైలు మార్గాలను ప్రైవేటీకరిస్తూ, ప్రైవేట్‌ రైళ్లు నడపడానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద ప్రజలు ప్రయాణించే పాసింజర్‌ రైళ్లను నిలిపివేయడంతోపాటు అవి ఆగే చిన్నచిన్న స్టేషన్లను కూడా మోసేస్తున్నది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles