సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దింపి, తాము అధికారంలోకి రావాలని ఒక వంక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతలవారీగా పాదయాత్రలు చేస్తుంటే, తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహితం ప్రారంభించారు. అయితే వీళ్లిద్దరు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, తాము అధికారంలోకి వస్తే చేయబోయే ఘనకార్యాలు ఏమిటో చెప్పడం ద్వారా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు.
సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, విధ్వంసక పదజాలం వాడుతూ రాష్ట్రం ప్రజలను భయకంపితులను కావించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ రెండు రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో అద్య్హక్షులుగా ఉన్నంతకాలం కేసీఆర్ అధికారంలో కొనసాగేందుకు ఎటువంటి సమస్యలు తలెత్తవని ఈ సందర్భంగా పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ ను నక్షలైట్లు ప్రేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. నేను తక్కువా అన్నట్లుగా ఆ ఆతర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రతిష్టాకరంగా నిర్మించిన నూతన సచివాలయం భవనంపై డూమ్ లను కూల్చివేస్తానంటూ బండి సంజయ్ ప్రకటించారు. వీరిద్దరి ప్రకటనలు చూసి జనం నివ్వెరపోయారు.
వీరి ప్రకటనలపై జనం ఏమనుకొంటున్నారో గాని, ఎవ్వరు చివరకు వారి వారి పార్టీలలోని సమర్ధించలేకి ఇరకాటంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. వారి విధ్వంస రాజకీయాలపై బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్న, ఆయా పార్టీల నేతలు ఎవ్వరు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
తెలంగాణ సచివాలయం, ప్రగతి భవన్ భవనాలను కూల్చివేస్తామని జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు రాష్ట్ర శాఖల అధ్యక్షులు రాజ్యాంగంపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, అరూరి రమేశ్, దుర్గయ్య చిన్నయ్య మండిపడ్డారు.
దేశములో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించి దానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకుంటే కూల్చివేస్తామని బండి సంజయ్ పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు. అంబేద్కర్ అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరో నేత రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చివేస్తామని సైకో మాదిరిగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఇద్దరు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి, టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇద్దరు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
నూతన సచివాలయానికి కి అంబేద్కర్ పేరు పెట్టుకుంటే బండి సంజయ్ ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ను అవమానపరుస్తున్న సంజయ్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని, ఇద్దరినీ ఎర్రగడ్డ లో జాయిన్ చేయాలని ఎద్దేవా చేశారు.