మోక్షు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను!

Thursday, January 2, 2025

నందమూరి బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి మోక్షజ్ఞ తన తొలి సినిమాను యంగ్‌ డైరెక్టర్‌,  సూపర్‌ సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ప్రశాంత్ వర్మ సాలిడ్‌గా ప్లాన్ చేస్తున్నాడు.

ఇదే విషయాన్ని ఆయన తాజాగా జరిగిన ‘జీబ్రా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ  చెప్పారు.  సత్యదేవ్ తనకు ఫోన్ చేసినప్పుడు నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ తొలి సినిమాను సాలిడ్‌గా ప్లాన్ చేసే పనిలో బిజీగా మారానని.. అయినా, సత్యదేవ్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గారు గెస్టుగా వస్తున్నాడనే కారణంగా తాను వచ్చానని ప్రశాంత్ వర్మ తెలిపాడు.

దీంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులు మరోసారి ప్రశాంత్ వర్మ కామెంట్లను అలా వైరల్‌ చేసి పడేస్తున్నారు అంతే. మరి మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి కథను ప్లాన్ చేస్తున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles