మొదటిసారి రేవంత్ నోటా రాజీనామా మాట!

Thursday, September 19, 2024

తన నాయకత్వంపై తెలంగాణలోని సీనియర్లు తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తున్నా లెక్కచేయకుండా తన పని తాను చేసుకొంటూ పోతున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటా మొదటిసారిగా రాజీనామా మాట వినపడటం విస్మయం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మెరుగైన స్థాయికి వెళుతుందననుకుంటే తన పీసీసీ పదవి వదులుకుంటానని ప్రకటించారు.

గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు జరిగిన శిక్షణా తరగతులకు రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్లు అందరూ గైరజరయ్యారు. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఫోన్ చేసి హాజరుకమ్మనమని కోరినా సీనియర్లు లెక్క చేయలేదు.

ఈ సభలో మాట్లాడుతూ పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. అయితే, పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయని.. నేతలు సర్దుకుపోవాలని సూచించారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని అంటూ  జానారెడ్డి, భట్టి విక్రమార్క సూచనలను స్వాగతిస్తున్నామని రేవంత్ చెప్పడం ద్వారా సీనియర్ నేతలతో సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఇచ్చారు.

అదే సమయంలో పార్టీలో న చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొందాం అంటూ వారి పట్ల రాజీ ధోరణికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతం కూడా ఇచ్చారు.పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ వచ్చి రాయబారం నడిపినా తన నాయకత్వం పట్ల విముఖంగా ఉన్న పార్టీలోని సీనియర్ నేతలు మెట్టు దిగక పోవడంతో  రేవంత్ రెడ్డి వారిని దారిలోకి తెచ్చేందుకు మరో మార్గం ఎంచుకున్నారా?

టీపీసీసీని టిడిపి నుండి వచ్చిన వారితో నింపివేశారని ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. వారిని శాంతపరచడానికా అన్నలంటూ  తనకు రాజకీయ గురువుగా చెప్పుకొనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన సెటైర్లు వేశారు. మీడియాను అడ్డం పెట్టుకొని తమను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని సీనియర్లపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం మీడియా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడినా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాన్ని శాసించలేదని అంటూ మీడియాలో తనకు వ్యతిరేకంగా కధనాలు వ్యాప్తి చేయడం ద్వారా పార్టీలో తనను ఏమీ చేయలేరనే హెచ్చరిక చేసిన్నట్లు కనిపిస్తున్నది.

టీడీపీ నుంచి బయటకు వచ్చాక రేవంత్ ఏనాడు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. టీడీపీ తనకు రాజకీయ భిక్షను ప్రసాదించిందని పలు సందర్భాల్లో వెల్లడించారు. టీడీపీని, చంద్రబాబును రేవంత్ పరోక్షంగా కానీ, పత్యక్షంగా కానీ ఏనాడు విమర్శించలేదు. అలాంటి రేవంత్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నారని వ్యాఖ్యనించటం ఇప్పుడు ఆసకక్తికరంగా మారింది.

తనపై పడిని టీడీపీ ముద్రను పోగొట్టుకోవటానికే రేవంత్ ఇలా మాట్లాడినట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ రేవంత్  మద్దతుదారుడన్నది అసమ్మతి నేతల ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఠాకూర్ ను గోవాకు ఇన్ ఛార్జ్ గా మార్చి, తెలంగాణకు కొత్తగా మహారాష్ట్రలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ హోమ్ మంత్రి, పిసిసి అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేసిన మాణిక్‌రావు థాకరేను నియమించడంతో ఇక ఏకపక్షంగా వ్యవహరించడం కుదరక పోవచ్చని రేవంత్ జాగ్రత్త పడుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles