మొదటిసారి అభిమాన హీరో బాలకృష్ణను టార్గెట్ చేసిన జగన్

Sunday, December 22, 2024

వాలంటీర్ల వ్యవస్థ తీరుతెన్నులపై కొంచెం మోటుగానైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి ఆత్మరక్షణలో పడిన్నట్లున్నది.  వాలంటీర్లు సేకరిస్తున్న డేటాను వైసీపీ  ప్రభుత్వం, వైసీపీ నేతలు దుర్వినియోగ పరుస్తున్నారని ఆయన ప్రాధమికంగా ఆరోపణలు చేశారు. ఆ డేటాను కొందరు వైసిపి నేతలు `మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్)కు కూడా ఉపయోగించుకుంటున్నారని కూడా ఆరోపించారు.

అయితే, వైసిపి మంత్రులు, నేతలు వాలంటీర్లే `మానవ అక్రమ రవాణా’కు పాల్పడుతున్నట్లు పవన్ ఆరోపించారంటూ ఆయనపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. కానీ పవన్ లేవనెత్తిన తీవ్రమైన `డేటా చౌర్యం’ ఆరోపణలను పట్టించుకోకుండా, వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆ విధంగా సేకరించిన డేటాను హైదరాబాద్ లోని ఓ వైసీపీ నేతకు సంబంధం గల ప్రైవేటు కంపెనీకి ఏవిధంగా చేరవేస్తున్నారని పవన్ నిలదీశారు. దీనికి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి స్పందన లేదు. కీలకమైన అంశం నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇప్పుడు సీఎం జగన్ రంగంలోకి దిగారు.

పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్, నందమూరి బాలకృష్ణలపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. చాలాకాలంగా జగన్ అభిమాన నటుడు బాలకృష్ణ. ఆయన సినిమాలను మొదటిరోజున చూడటమే కాకుండా, అప్పుడప్పుడు షూటింగ్ ల సమయంలో వెళ్లి చూసీవాడు. తండ్రి సీఎంగా ఉన్న సమయంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తీయాలనుకున్నాడు. కానీ బాలకృష్ణనే వెనుకడుగు వేశారు.

ఇప్పటి వరకు ఎప్పుడు బాలకృష్ణపై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మొదటిసారి చేశారు. చాలా ఏళ్ల క్రితం బాలకృష్ణ ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో తాను ఆ మాటలు అన్న ఉద్దేశం వేరని, అన్న సందర్భాన్ని ప్రస్తావించకుండా తప్పుడు ప్రచారం చేశారని వివరణ ఇచ్చారు. మహిళా లోకానికి క్షమాపణలు కూడా చెప్పారు అని అన్నారు. 
అయితే ఇప్పుడు ఆ మాటల్ని జగన్ మోహన్ రెడ్డి వినిపించారు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి. కడుపు అయినా చేయాలంటూ తన అభిమాన హీరోగా ఉన్న బాలకృష్ణ  ఉద్దేశించి మాట్లాడారు.

2.6 లక్షలమంది వాలంటీర్లలో 60శాతం మంది మహిళలే. వాలంటీర్లంతా చదువుకున్న సంస్కారవంతులు. ఇలాంటి వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పుబట్టిన వారు ఎవరంటే అంటూ జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగారు.  ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న వాలంటీర్‌.. ప్యాకేజీ స్టార్‌, ఇంకొకరు చంద్రబాబు. వాలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు క్యారెక్టర్‌, దత్తపుత్రుడి క్యారెక్టర్‌, ఆయన సొంతపుత్రుడి క్యారెక్టర్‌, అలాగే ఆయన బావమరిది క్యారెక్టర్‌ ఏంటో ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబరుచుకున్నారా? లేక దత్తపుత్రుడు ఇదే కార్యక్రమం పెట్టుకుని అమ్మాయిలను లోబరుచుకున్నారా? అంటూ జగన్ ప్రశ్నించారు. 

“ఒకరిని పెళ్లిచేసుకోవడం… నాలుగేళ్లు కాపురం చేయడం మళ్లీ వదిలేయడం. మళ్లీ ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం.. మళ్లీ వదిలేయడం. మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం. ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో సంబంధం” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జగన్.

అంతటితో ఆగకుండా, పట్టపగలే మందుకొడుతూ… 10 అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌లో డ్యాన్స్‌ చేసేవాడు ఇంకొకరు ఉన్నారని పరోక్షంగా లోకేష్ ను ప్రస్తావిస్తూ  జగన్ విరుచుకుపడ్డారు. “ఇంకొకడు.. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంటాడు, లేకపోతే కడుపైనా చేయాలంటాడు. మరో దౌర్భ్యాగ్యుడు. వయస్సు 75 ఏళ్లు అయినా సిగ్గులేదు.., ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజజీవితంలో చేశాను అంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకరు” అంటూ బాలకృష్ణ, చంద్రబాబులపై విరుచుకు పడ్డారు. 

ఇలాంటి క్యారెక్టర్‌లేని వాళ్లంతా మంచి చేస్తున్న మన వలంటీర్లు గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారని `డేటా చౌర్యం’ గురించి జనం మాట్లాడుకోకుండా దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles