మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వానికి డెత్ వారెంట్!

Saturday, January 18, 2025

ఒకవంక కర్ణాటక ఎన్నికలలో తిరిగి గెలుపొందడం ద్వారా 2024 ఎన్నికల పోరాటానికి బలమైన భూమిక ఏర్పాటు చేసుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం సర్వశక్తులు సమకూర్చుకొని పోరాడుతుండగా మహారాష్ట్రలో ఆ పార్టీ కనుసన్నలలో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకొని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గత ఏడాది తామెంతో కష్టపడి ఉద్ధవ్ థాకరే ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పాటు చేసిన ఏక్నాథ్ షిండేతో `కీలుబొమ్మ’ ప్రభుత్వానికి `డెత్ వారెంట్’ను శివసేన (యుబీటీ) నేత సంజయ్ రౌత్ జారీచేశారు.  ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లో కూలిపోతుందంటూ ఆదివారం సంచలన ప్రకటన చేశారు.

ఉద్దవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా అనేక పిటిషన్లపై  తీర్పులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు.  ఈ తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పడం ద్వారా వారిని అనర్హులుగా అత్యున్నత న్యాయస్థానం ప్రకటిస్తే, ఈ ప్రభుత్వం కూలిపోతుందని సంకేతం ఇచ్చారు.

సీఎం  ఏక్నాథ్ షిండే ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 20 రోజుల్లో కూలిపోతుందని అంటూ  దానిపై ఎవరు సంతకం చేస్తారనేది ఇప్పుడు  నిర్ణయించాల్సి ఉందని సంజయ్ రౌత్  ప్రకటించారు. ఫిబ్రవరిలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని సంజయ్ రౌత్ గతంలో కూడా ఈలాంటి కామెంట్స్ చేశారు. 

కాగా గత ఏడాది జూన్‌లో  షిండేతో పాటుగా మరో 39 మంది ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఫలితంగా ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది.  దీంతో సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు. అనంతరం ఏక్‌నాథ్‌ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గత ఏడాది జూన్‌ 30న షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇలా ఉండగా, ప్రస్తుత ప్రతిపక్ష నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్  సుమారు 40 మంది ఎమ్యెల్యేలతో `తిరుగుబాటు’ చేసి బిజెపితో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని వారం రోజులుగా కధనాలు వస్తున్న సమయంలో సంజయ్ రౌత్ ఈ `డెత్ వారెంట్’ జారీచేయడం గమనార్హం.

అయితే, ఏక్నాథ్ షిండే ప్రజల మద్దతు పొందలేకపోతున్నారని, ఉద్ధవ్ థాకరేకే ప్రజలలో సానుభూతి పెరిగిందని బీజేపీ భావిస్తున్నది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలలో  మహా వికాస్ అఘాడి 35 వరకు స్థానాలు గెల్చుకొంటుందని బీజేపీ ఆంతరంగిక సర్వే స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

అందుకనే ఏక్నాథ్ షిండే స్థానంలో అజిత్ పవర్ ను ముఖ్యమంత్రిగా చేస్తే 2024లో అత్యధికంగా ఎంపీ సీట్లు గెల్చుకోవచ్చని చూస్తున్నట్లు వార్తాకథనాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామాల పట్ల ఏక్నాథ్ షిండే శిబిరంలో ఆందోళన అవ్యక్తం అవుతుంది. అదే జరిగితే, తామే ప్రభుత్వం నుండి బయటకు వెడతామని వారు హెచ్చరికలు పంపుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles