మళ్లీ తెరపైకి హైదరాబాద్‌ రెండో రాజధాని అంశం.. కేసీఆర్ మౌనం

Monday, December 23, 2024

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను మార్చాలన్న అంశం మరోమారు తెరపైకి వచ్చింది. దేశ సరిహద్దుల్లో తరచుగా ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ చేశారు. అయితే, ఆయన సూచనను నాటి నెహ్రు ప్రభుత్వం పట్టించుకోలేదు.

తిరిగి, ఇప్పుడు మరోసారి ఆయన మనవడు ప్రకాష్ అంబెడ్కర్ హైదరాబాద్ లో తిరిగి ఈ సూచనను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబెడ్కర్ విగ్రవిష్కరణలో పాల్గొన్న ఆయన  ఇప్పటికి ఈ ప్రతిపాదన అమలు కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. అయితే కేసీఆర్ ఈ అంశంపై మౌనం వహించారు.

రెండో రాజధానిగా హైదరాబాద్ చేస్తే, తెలంగాణకు కీలకమైన వనరులు అందిస్తున్న ఈ నగరంపై రాష్త్ర ప్రభుత్వ ఆధిపత్యం కోల్పోవలసి వస్తుందనే భయం కావచ్చు. అందుకనే కేసీఆర్ ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేన్నట్లు ఆయన వ్యవహారం వెల్లడి చేస్తుంది.
అప్పట్లో అంబేడ్కర్‌ హైదరాబాద్‌ను పలుమార్లు సందర్శించిన సందర్భంగా ఇక్కడి వాతావరణం అయన్ను కట్టిపడేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర స్థానంలో ఉండడంతో రెండో రాజధానిగా చేయాలని తన పుస్తకంలో కూడా రాశారని ప్రకాష్‌ అంబేడ్కర్‌ గుర్తు చేశారు.

రెండో రాజధానిగా మార్చేందుకు హైదరాబాద్ లో అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఢిల్లితో పోలిస్తే భద్రతాపరంగా దేశానికే రక్షణ కవచంగా హైదరాబాద్‌ ఉంటుందని ఆనాడే పలువురు నిపుణులు సహితం స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లి పాకిస్తాన్‌ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా చైనా సరిహద్దుకు కేవలం 500 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో రాజధానితో పాటు రెండో రాజధాని కూడా ఉంటే బాగుంటుందనే చర్చ జరిగింది.

1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కాకపోవడంతో అప్పటి హోంశాఖ మంత్రి సర్ధార్‌ పటేల్‌ నిజాంపాలకులపై సైనిక చర్యకు దిగటంతో హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనమైన సంగతి ఒక చరిత్ర.  సైనిక చర్య అనంతరం దేశానికి రెండో రాజధాని అవసరాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

అంతటితో ఆగకుండా ఆనాటి కేంద్ర మైన్స్‌ , పవర్‌ అండ్‌ వర్క్‌ మంత్రి విఎన్‌ గాడ్గిల్‌ను మహారాష్ట్రలోని నాసిక్‌, హైదరాబాద్‌ స్టేట్‌లోని సికింద్రాబాద్‌ను సందర్శించాలని పంపించింది. నాసిక్‌ కంటె కూడా సికింద్రాబాద్‌ అయితేనే అనువైన ప్రదేశమని గాడ్గిల్‌ కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత పట్టించుకునే వారు లేనందున ఈ అంశం మూలకు పడింది.

ఆ తర్వాత 1950 లో అంబేడ్కర్‌ రెండో రాజధాని అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అందుకు హైదరాబాద్‌ అయితేనే బాగుంటుందని కూడా సూచించారు. అంతేగాక అదే సంవత్సరం తాను రాసిన థాట్స్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్‌ స్టేట్స్‌’ అనే పుస్తకంలో కూడా హై దరాబాద్‌ నగరాన్ని రెండో రాజధానిగా చేస్తే ఉమ్మడి ప్రయోజనాలుఉంటాయని అంబేడ్కర్‌ ప్రస్తావించారు.

2013 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో కూడా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రా ప్రాంతం నుంచి డిమాండ్లు వచ్చాయి. అయితే అందుకు తెలంగాణ ప్రాంతం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles