మరో వారసుడికి శ్రీకాళహస్తిలో టిడిపి అధినేత చెక్!

Sunday, December 22, 2024

తెలుగు దేశం పార్టీ మొదటి నుండి వారసత్వ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది. మామ నుండి పార్టీ నాయకత్వం వారసత్వంగా కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన వారసుడిగా కుమారుడు నారా లోకేష్ ను ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా పలు నియోజకవర్గాల్లో వారసులకు సీట్లు ఇచ్చి వారిని ఎమ్యెల్యేలుగా ఎన్నికయ్యేటట్లు చేశారు.

అంతేకాదు, ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారి వారసులను సహితం దరి చేర్చుకొంటున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో రాజకీయాలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు తనకు తప్ప కుటుంభంలో మరెవ్వరికీ ఎమ్యెల్యే, ఎంపీ, ఎమ్యెల్సీ సీట్లు ఇప్పుచుకోలేక పోయారు. అయితే చంద్రబాబు హయాంలో ఆయన ఎంపీగా, తమ్ముడు ఎమ్యెల్యేగా, మేనల్లుడు ఎమ్యెల్సీగా చేశారు. గత ఎన్నికలలో ఆ సోదరుల కుమారులకు వారి సీట్లు ఇచ్చారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు, యనమల రామకృష్ణుడు, ఎంవీవీఎస్ మూర్తిలతో సహా అనేకమంది టిడిపి ప్రముఖుల వారసులను అక్కున చేర్చుకుంటున్నారు. అయితే, కొందరు ప్రముఖుల వారసుల విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. వారు తమ తండ్రుల అధికారం అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా వ్యవహరించి, పార్టీకి నష్టం కలిగించడం ఒక కారణం కావచ్చు.

కొద్ది నెలల క్రితం సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంను కాదని బిజెపి నుండి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా నియమించడం పార్టీలో అలజడికి దారితీసింది. తాజాగా, శ్రీ కాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జా గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జా సుధీర్ రెడ్డిని సహితం పక్కకు నెట్టి వేస్తున్న దృశ్యం కనిపిస్తుంది.

శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారం రోజుల తర్వాత మంచి రోజు చూసుకుని పార్టీలో చేరాల్సిందిగా కోరారు. సత్యవేడుతో పాటు కొన్ని నియోజకవర్గాల బాధ్యత కూడా చూడాల్సి వస్తుందని ఎస్ సి వి నాయుడుతో చంద్రబాబు చెప్పారు.

 వాస్తవానికి ఈ నెల 8న పార్టీలో చేరడానికి నాయుడు సిద్ధమయ్యారు. అయితే ఎస్ సి వి నాయుడు పార్టీలో చేరే విషయమై తనకు సమాచారం లేదనీ, తనను ఆహ్వానించలేదని బొజ్జల సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎవరు హాజరు కావద్దని సుధీర్ రెడ్డి కోరారు. దీంతో ఎస్ సి వి నాయుడు పార్టీలో చేరడం తాత్కాలికంగా వాయిదా పడింది.

తాజాగా, టిడిపి సర్వసభ్య సమావేశంకు హాజరైన నాయుడు తాను పార్టీలో చేరే విషయం ప్రస్తావించగా వారం రోజుల తర్వాత రమ్మనమని చంద్రబాబు చెప్పారు. అందుకు సుధీర్ రెడ్డి అభ్యంతరం చెప్పబోగా మీరు ఆబ్రాడ్ లో తిరగండి సరిపోతుందని కొంచెం కరకుగా అన్నట్లు తెలిసింది.

శ్రీకాళహస్తికి చెందిన ఎస్ సి వి నాయుడు 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009 ఎన్నికల్లో కూడా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి, సత్యవేడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పనిచేశారు.

2014 ఎన్నికలలో ఆయన శ్రీకాళహస్తి టిడిపి టికెట్ ను ఆశించారు. టిడిపి టిక్కెట్టు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి దక్కింది. తరువాత కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్న ఎస్ సి వి నాయుడు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయానికి కృషి చేశారు.

అయితే పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్యెల్సీ  ఇస్తామని పార్టీ అధినేత జగన్, జిల్లా మంత్రి రామచంద్రారెడ్డి, ఎస్ సి వి నాయుడుకు హామీ ఇచ్చారు. కానీ, చివరి నిమిషంలో ఎమ్మెల్సీ సీట్ సిపాయి సుబ్రహ్మణ్యంకు ఇచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసిపిలో చేరిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఇవ్వడం నాయుడు, ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. దానితో వైసీపీకి  రాజీనామా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles