మరోసారి సోము వీర్రాజుపై భగ్గుమన్న కన్నా!

Sunday, December 22, 2024

నోటా  కన్నా తక్కువ ఓట్లున్న ఏపీ బీజేపీలో కుమ్ములాటలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుల మధ్య విబేధాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి.  తాజాగా కొన్ని జిల్లా కమిటీల అధ్యక్షులను ఎవ్వరికీ చెప్పకుండా సోము వీర్రాజు మార్చడంపై కన్నా భగ్గుమన్నారు.

పార్టీ రాష్ట్ర కొర్  కమిటీలో చర్చింపకుండా ఏకపక్షంగా మార్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించినవాళ్ళని చెప్పుకొచ్చారు. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో చేరిన ఎంతో మంది ఇప్పుడు పార్టీని ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారో సోము వీర్రాజు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 పైగా,స్వయంగా తన వియ్యంకుడు ఎందుకు బిఆర్ఎస్ లో చేరారో కూడా సోము సమాధానం చెప్పాలని నిలదీశారు. సోము వీర్రాజుతో పాటు ఆయనకు కొండంత అండగా ఉంటున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ధోరణిపై కూడా కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

జివిఎల్ ఆలోచన విధానం ఎప్పుడు స్థానిక బిజెపి కార్యకర్తలకు భిన్నంగా ఉంటుందని కన్నా మండిపడ్డారు. అమరావతి విషయంలో జీవీఎల్ అనుసరించిన పొంతనలేని విధానాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇలా  ఉండగా, జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే ఏపీలో పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరారని కన్నా ఆరోపించడం కలకలం రేపుతున్నది. ఆయన పరోక్షంగా ఈ కుట్రలో సోము వీర్రాజు, జివిఎల్ కూడా భాగస్వాములే అన్నట్లు సంకేతం ఇచ్చారు. వీరిద్దరిని `బీజేపీలో జగన్ ఏజెంట్లు’ అంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం.

వాస్తవానికి, కన్నా బీజేపీలో చేరడంలో సోము వీర్రాజు కీలక పాత్ర పోషించారు. నాటి కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డా. కె హరిబాబులకు ఏమాత్రం తెలియకుండా కన్నాను నేరుగా ఢిల్లీ తీసుకెళ్లి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేయించారు. అయితే అమిత్ షా అక్కడ కన్నాను పార్టీలో చేర్హ్చుకోకుండా, విజయవాడ వెళ్లి పార్టీ ఆఫీసులో (హరిబాబు వద్ద) చేరమని చెప్పి పంపించారు.

అప్పటి నుండి సోము వర్గంగా కన్నా పేరొందిన, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి వీర్రాజు పేరు ఖరారు అయినా సమయంలో వెంకయ్యనాయుడు అడ్డుపడి, కన్నాను రాష్ట్ర అధ్యక్షునిగా చేయడంతో అప్పటి నుండి కన్నా – సోము దారులు వేరయ్యాయి. తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన వీర్రాజు తన కమిటీలలో ఎక్కడా ఖన్నాతో సన్నిహితంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles