మరింత లేట్ చేస్తున్న చరణ్ మూవీ! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” మరి ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా మాత్రం చాలా వీక్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇటీవల కాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకి కూడా లేని విధంగా క్లూ లెస్ గా ఆడియెన్స్ లో ఈ సినిమా ఛేంజ్ అయ్యింది. తాజా పాన్ ఇండియా సినిమాల ట్రైలర్ లు మినిమం నెల లేదా కనీసం 15 రోజులు ముందు అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కానీ గేమ్ ఛేంజర్ లాంటి సినిమా ట్రైలర్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే దీనికంటే హైలైట్ గా సినిమా విడుదలకి వారం కూడా కాదు 5 రోజులు ముందు ఈ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు టాక్ ఇపుడు వినపడుతుంది. అయితే మేకర్స్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి దీనిపై ఓ క్లారిటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు.