మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీలకు చుక్కెదురు

Wednesday, January 22, 2025

బలమైన ప్రతిపక్షాల కీలక నాయకులే లక్ష్యంగా  సాగుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో వరుసగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల దర్యాప్తులు కేవలం రాజకీయంగా తమను వేధించడం కోసమే అంటూ బిఆర్ఎస్, ఆప్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది.   సోమవారం వరుసగా రెండు కోర్టులలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు చుక్కెదురైంది. 

దానితో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఈ కేసులో త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని అంటూ బిజెపి నాయకులు చేస్తున్న ప్రచారానికి పెద్ద షాక్ ఇచ్చిన్నట్లయింది.  అసలు ఇందులో కేసు ఎక్కడ ఉంది? రూ 100 కోట్లు అని మీరు అనడమే గాని ఆ డబ్బు చేతులు మారినట్లు ఎటువంటి ఆధారాలైనా చూపించారా? అంటూ ప్రశ్నిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం కలకలం రేపుతోంది.

ఇందులో నేరం జరిగిన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అప్రూవర్ గా మారిన వ్యక్తి చెప్పిన నోటి మాటల ఆధారంగా నిందితులకు ఈ కుంభకోణంలో సంబంధం ఉందని నిర్ధారించలేమని కూడా తేల్చి చెప్పింది.  నేరం జరిగిన్నట్లు చూపడానికి ఈడీ ఎటువంటి ప్రాధమిక సాక్ష్యాధారాలను చూపించలేకపోయిన్నట్లు కోర్టు అభిప్రాయపడింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్‌ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి మండిపడ్డారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్‌లోని స్క్రిప్ట్‌ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్‌కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ నేతలు ఆరోపించినట్టుగా ఈ కేసులో ఒక్క పైసా లావాదేవీలపైనైనా సీబీఐ, ఈడీ వద్ద ఆధారాలు లేవని స్వయంగా కోర్టే అభిప్రాయపడిందని ఆమె గుర్తు చేశారు.

మరోవంక, ఈ కుంభకోణం అంతా `సౌత్ గ్రూప్’ జరిపింది అంటూ దర్యాప్తు సంస్థలు పేర్కొంటుండటం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం కాకపోయినా సౌత్ గ్రూప్ పేరుతో దర్యాప్తు సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దర్యాప్తు సంస్థలు దక్షిణాది రాాష్ట్రాల అర్థం వచ్చేలా సౌత్ గ్రూప్‌గా పేర్కొనడాన్ని కోర్టు తప్పు పట్టింది.

ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దక్షిణాది రాష్ట్రాలను అవమానించేలా ‘సౌత్‌ గ్రూప్‌’ పదాన్ని వినియోగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీబీఐ, ఈడీల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయ పడింది. మద్యం పాలసీ వ్యవహారంలో దాఖలైన చార్జిషీట్లలో ‘సౌత్‌ గ్రూప్‌’ పదాన్ని వాడటాన్ని సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. తక్షణం ఆ పదాలను తొలగించాలని సూచించింది.

ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ, ఈడీలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే దర్యాప్తు సంస్థలు దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్‌ గ్రూప్‌’ పదాన్ని ఎలా వినియోగిస్తాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

సీబీఐ, ఈడీల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీలు సమర్పిస్తున్న చార్జిషీట్లు, ఎఫ్‌ఐఆర్‌లలో ‘సౌత్‌ గ్రూప్‌’ అనే పదాన్ని వాడటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బ తీశారంటూ హైదరాబాద్‌కు చెందిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఉత్తరాది ప్రాంతానికి చెందినవారు కూడా ఉన్నారని, వారిని ‘నార్త్‌ గ్రూప్‌’గా సీబీఐ ఎక్కడా సంబోధించలేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles