మంత్రి జయరాం అవినీతి గుట్టు రట్టు చేసిన లోకేష్

Sunday, December 22, 2024

ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో యువగళం పాదయాత్ర జరుపుతున్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతి చిట్టాను రట్టు చేశారు. ఇట్టినా ప్లాంటేషన్‌ భూముల్ని మంత్రి జయరాం కొట్టేవారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి భూములు కొట్టేసిన క్రమాన్ని బయట పెడుతూ, ఆధారాలను విడుదల చేశారు.

నారా లోకేష్ విసిరిన సవాల్‌కి మంత్రి జయరామ్ వింత సమాధానం చెబుతున్నారని ఆలూరు టీడీపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ధ్వజమెత్తారు. దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ బాబు సవాల్‌ని మంత్రి స్వీకరించాలని ఆమె కూడా సవాల్ చేశారు. జయరామ్‌కు టీడీపీ జడ్పీటీసీ భిక్ష పెట్టిందని ఆమె గుర్తు చేశారు. కానీ ఆయన వేరే పార్టీలోకి వెళ్లి పీకేందేంటని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.

జిల్లాలో మొత్తం 180 ఎకరాల ఇట్టినా ప్లాంటేషన్ భూముల్ని మంత్రి కాజేశారని లోకేష్ ఆరోపించారు. కమర్షియల్ ల్యాండ్ గా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపించి తన కుటుంబం పేర రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. రూ.45 కోట్లు విలువైన భూమిని 2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారు చౌకగా కొట్టేసినట్లు ఆధారాలు విడుదల చేశారు.

వ్యవసాయంలో లాభం వచ్చిందన్న మంత్రి ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నారని లోకేష్ ప్రశ్నించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనలను మంత్రి, ఆయన కుటుంబం అతిక్రమించి భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. భూములు అమ్మిన మంజునాథ్ సేల్ డీడ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడని లోకేష్ నిలదీశారు.

అసలు ఆ భూములు అమ్మే హక్కు అతనికి లేదు కాబట్టి సేల్ డీడ్ రద్దు చేసుకున్నాడని చెప్పారు. ఐటి బినామీ యాక్ట్ ప్రకారం బెంజ్ మంత్రి అడ్డంగా దొరికిపోయాడని ఎద్దేవా చేశారు. కుటుంబ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇటినా భూములు కొన్నా అంటున్న మంత్రి, తన కుటుంబ భూముల గురించి ఎన్నికల ఎఫిడవిట్ లో ఎందుకు చూపలేదని లోకేష్ ప్రశ్నించారు.

ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా ముందుకు వస్తే భూములు రైతులకు వెనక్కి ఇస్తామన్న మంత్రి ఇప్పుడు ఎందుకు మాట మార్చారని నిలదీసేరు. ప్రభుత్వ ధర ప్రకారం ఆ భూములు కొని రైతులకు పంచుతా అని అంటే దానికి స్పందించకుండా అర్దం లేని ఆరోపణలు చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తాను నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దైర్యం లేకే బూతులు తిడుతున్నారని లోకేష్ మండిపడ్డాయిరు. ఐటి డిపార్ట్మెంట్ కి అడ్డంగా దొరికిపోయి నీతులు మాట్లాడటం మంత్రి జయరాంకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంత్రి వందల ఎకరాలకు అధిపతి అయ్యారని, ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఎకరం భూమి కొనే స్థితిలో ఉన్నారా? అని నిలదీశారు. రైతులకి భూములు రాసిస్తానన్న మంత్రి రిజిస్ట్రేషన్‌కు ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు.

‘‘జయరాంకి లోకేష్ బాబు కాదు.. నేను సవాల్ చేస్తున్నా. ఐటీ ఇచ్చిన నోటీసులకు జయరామ్ సమాధానం చెప్పాలి. మంత్రి జయరాం కర్ణాటక మద్యం,పేకాట స్థావరాలు, ఇసుక లూటీ ,బియ్యం మాఫియా ప్రజాలకంతా తెలుసు. బాధిత రైతులకు మేము అండగా ఉంటాం. మేము అధికారంలోకి రాగానే.. రైతులకు కోల్పోయిన భూముల విషయంలో న్యాయం చేస్తాం’’ అని సుజాతమ్మ విమర్శించారు.

ఆలూరు నియోజకవర్గంలో ఇట్టినా ప్లాంటేషన్ భూముల వ్యవహారం గత కొద్ది నెలలుగా దుమారం రేపుతోంది. ఇట్టినా సంస్థ నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా వందల ఎకరాల భూముల్ని కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వీటిని తాను చట్టబద్దంగా కొన్నానని గత ఏడాది మంత్రి ప్రకటించారు.  2006 ధరలకు రైతులు ఇట్టినా సంస్థకు భూముల్ని అమ్ముకున్నారని, 2019లో గెలిచిన తర్వాత వాటిలో 100 ఎకరాల్ని తన కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్లు గత ఏడాది డిసెంబర్‌లో మంత్రి జయరాం ప్రకటించారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles