బీజేపీతో పొత్తుపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు

Saturday, January 18, 2025

టిడిపి అధినేత వివిధ కారణాల చేత నోటా కన్నా తక్కువ ఓట్లున్న బిజెపితో పొత్తు కోసం ఆరాటపడుతుండగా, ఈ విషయమై ఆ పార్టీ శ్రేణులలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ అండ లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తుంటే, ఈ పొత్తు కారణంగా కొన్ని వర్గాల ఓట్లు కోల్పోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా మైనారిటీల ఓట్లను పూర్తిగా కోల్పోవలసి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో మైనారిటీలు కేంద్రుకృతమైన నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు వారెవ్వరూ ఓట్లు వేయలేదని, కానీ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక 2019లో కొంతమేరకు ఓటు వేశారని గుర్తు చేస్తున్నారు.

వైఎస్ జగన్ పాలనలో మైనారిటీలు సహితం వేధింపులకు గురికావడం, పైగా బిజెపితో తెరచాటు స్నేహం చేస్తుండడంతో ఈ సారి వారిలో అత్యధికులు టిడిపికి ఓటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటువంటిదిప్పుడు బిజెపితో స్నేహం చేస్తే వారందరి ఓట్లను గంపగుట్టుగా వైసీపీకి అప్పచెప్పిన్నట్లు కాగలదని స్పష్టం చేస్తున్నారు.

మరోవంక, టిడిపిని సొంతం చేసుకున్న కీలకమైన సామాజిక వర్గంలో సహితం గత ఎన్నికలలో ఆ పార్టీ పట్ల ఒకింత అసహనం వ్యక్తమైనా సుమారు 30 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు. బీజేపీ తమ సామాజిక సామాజిక వర్గంకు చెందిన వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వారిలో తీవ్ర ఆగ్రవేశాలు నెలకొన్నాయి.

ఈ సారి గంపగుత్తుగా టీడీపీ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో టిడిపి బిజెపితో చేతులు కలపడం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడవలసి ఉంది.  బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా టిడిపి ఓట్లు ఆ పార్టీ అభ్యర్థులకు బదిలీ కావడమే గాని, సాంప్రదాయకంగా బిజెపికి ఉన్న ఓట్లు బదిలీ కావడం లేదని టీడీపీ నేతల అనుభవంలో తేలుతుంది. 

అందుకనే, ఓట్ల పరంగా బిజెపితో పొత్తు కారణంగా కొన్ని ఓట్లను పోగొట్టుకోవడమే గాని, ప్రయోజనం ఉండదని పలువురు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని టీడీపీ వర్గాలలో ఈ పొత్తు పట్ల ఆసక్తి కనబరచడం లేదు. అయితే కోస్తా జిల్లాలో టిడిపికి చెందిన వ్యాపార వర్గాలు మాత్రం పొత్తు ఉంటె కేంద్ర ప్రభుత్వం ద్వారా వ్యాపారపరంగా ప్రయోజనం పొందవచ్చని ఉబలాట పొందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles