బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

Sunday, December 22, 2024

తెలంగాణాలో అధికారం చేపట్టాలని ఆత్రుతతో ఉన్న బిజెపి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు కాకుండా అధికార పక్షాన్ని దెబ్బతీయడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇబ్బడిముబ్బడంగా ఉపయోగించుకొంటున్నది. ప్రతినెలా బిఆర్ఎస్ నాయకులు, వారికి సన్నిహితులైన వ్యాపారాలు, కాంట్రాక్టుదారులపై ఆదాయపన్ను శాఖ దాడులు జరుపుతున్నది.

తాజాగా, ఐఏఎస్ కు రాజీనామా చేసి, అధికారపక్షంలో చేరి, వెంటనే ఎమ్యెల్సీ అయినా వెంకట్రామిరెడ్డి ఇల్లు, ఆయనకు సంబంధించినవిగా భావిస్తున్న పలు సంస్థలలో సోమవారం నుండి ఐటి సోదాలు జరుగుతున్నాయి. తెల్లపూర్‌లో వసుధ ఫార్మా, రాజ్ పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థలు సహా 51 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 5 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఏక కాలంలో రైడ్స్ చేశారు. 

రాజ్ పుష్పలో వెంకట్రామిరెడ్డి వియ్యంకుడు భాగస్వామిగా ఉన్నట్లు తెలిసింది. వర్టెక్స్‌లో కంపెనీలోనూ కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఉదయం ముందుగా.. వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వసుధ ఫార్మా పేరుతో రాజు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 15 కంపెనీల పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది.

వసుధ ఫార్మా ఛైర్మన్‌గా రాజు ఉండగా.. అతడి ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న మరో ఆరుగులు ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

కాగా,  ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు భారీగా పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్,  ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండగా ఐటీ అధికారులు తరచూ రైడ్స్ ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ పెడుతున్నాయి.

మరోవంక, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ  కవితపై ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు వేలాడుతున్నది. ఈ సందర్భంగా ఆమెను సిబిఐ అధికారులు ఆమె ఇంట్లో విచారించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles