బిజెపి వైపు అడుగులేస్తున్న జయసుధ

Monday, December 23, 2024

2009లో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి పోటీచేసి ఉమ్మడి రాష్త్ర అసెంబ్లీకి ఎన్నికైనప్పటి నుండి ప్రముఖ సినీ నటి జయసుధ రాజకీయ నాయకురాలిగా మారారు. అయితే ఆ సమయంలో ప్రోత్సహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికలు ముగిసిన కొద్దీ నెలలకే మృతి చెందడంతో ఆమెను కాంగ్రెస్ లో పట్టించుకొనే వారు కనిపించలేదు.

పైగా, 2014లో రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ ఇక్కడ బలహీనం కావడంతో ఆమెకు రాజకీయ ఆశ్రయం దొరకలేదు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి చెందిన తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి టిడిపిలో చేరారు. అయితే టిడిపి నేతలు పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో ఆమె ఇంటికే పరిమితమైపోయారు.

మరోసారి 2019 ఎన్నికల ముందు ఆమె వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైసిపిలో చేరారు. వారు సహితం తెలంగాణాలో పోటీ పట్ల ఆసక్తి చూపక పోవడంతో ఆమెను పోటీ చేయించడం గాని ఏపీలో ఆమెను ప్రచారంకు తిప్పికొనే ప్రయత్నం గాని చేయలేదు. “నేను వెళ్లి పార్టీలో చేరినా వారు ఆ తర్వాత నన్ను పట్టించుకోలేదు. ఏ సమావేశానికి పిలవలేదు” అంటూ టీడీపీ, వైసిపిలలో తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వాస్తవానికి 1998 లోక్ సభ ఎన్నికల సమయంలోనే ఆమె టిడిపి ప్రచారంకు జయప్రదతో కలిసి ప్రచారంపై వచ్చారు. ఆమె మొదటగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం ప్రారంభించారు. అయితే అక్కడ ఎన్నికల ర్యాలీలలో బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చడం అలవాటు. ఆమె ఆ విధంగా ఒక ర్యాలీలో బాణాసంచా శబ్దాలు విని బాంబులు వేస్తున్నారు అనుకోని భయంతో దాదాపు స్పృహ కోల్పోయారు.

ఆ భయంతో వెనుకకు వెళ్ళిపోయినా ఆమె తిరిగి రాజకీయాలవైపు చూడలేదు. తాజాగా ఆమె బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర మంత్రి, రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని ఆమె కలవడంతో ఆమె బీజేపీలో చేరి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం బీజేపీ సహితం జనాకర్షణ గల అభ్యర్థుల కోసం ప్రయత్నం చేస్తున్నది. పైగా, గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కన్నా బిజెపి బలంగా ఉండడంతో ఆమె ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కొద్దీ నెలల క్రితమే బిజెపి చేరికల కమిటీ నేత ఈటెల రాజేందర్ ఆమెతో మంతనాలు సాగించారు. పార్టీలో చేరమని ఆహ్వానించారు.

ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో పాటు వెళ్లి ఆమెను కలిశారు. అయితే ఆ సమయంలో ఆమె ఓ నిర్ణయం తీసుకోలేక పోయారు.  తన సీటు విషయంలో పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరడంతో ఆ ప్రయత్నం అంతటితో ఆగిపోయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles