బిజెపి ఉచ్చులో చంద్రబాబు చిక్కుకుంటారా!

Wednesday, January 22, 2025

ఎన్డీయే నుండి వైదొలిగిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సారిగా శనివారం రాత్రి ఢిల్లీలో బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డలతో భేటీ జరపడం తెలుగు రాస్త్రాలలో రాజకీయ కలకలం రేపుతోంది. ఇది కేవలం ప్రాధమిక సమావేశమే అయినప్పటికీ, వెంటనే వారు ఒక నిర్ణయానికి వచ్చిన్నట్లు సంకేతాలు లేకపోయినప్పటికీ తిరిగి తెలుగు రాష్ట్రాల్లో పొత్తులకు టీడీపీ, బీజేపీ సిద్ధమవుతున్నట్లు మాత్రం సంకేతాలు పంపారు.

మొన్నటి వరకు `కుటుంభ పార్టీ’లతో బిజెపి కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు ఆ పార్టీ అధినేతతో సమావేశం కావడంకు కొంతమేరకు వారి మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణం కావచ్చు.`వైఎస్ జగన్ ముక్త ఏపీ’కోసం టీడీపీ, జనసేన, బీజేపీకి కలిసి పోటీచేయాలని ఆయన నేరుగా బిజెపి అధ్యక్షుడి వద్దనే ప్రతిపాదనలు ఉంచివచ్చారు.

అన్నింటికీ మించి ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో తెలుగు వారు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారని వెల్లడి కావడంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తమ ప్రతాపం చూపాలి అనుకొంటున్న బీజేపీలో వణుకు ప్రారంభయ్యింది. తెలుగు ప్రజలు బిజెపిని ద్వేషభావంతో చూస్తున్నారని గ్రహించారు. అందుకనే ఇక్కడ గట్టి పొత్తు అవసరమనే నిర్ణయానికి వచ్చారు.

వైసిపి అధికారికంగా ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినప్పటికీ 2014 నుండి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ వస్తోంది. బిజెపితో అధికారికంగా కలిస్తే ఎస్సీలు, మైనారిటీల ఓట్లు వేయరని భయం ఉంది. జగన్ ఉన్నదన్న భరోసాతోనే 2014లో కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలలో టీడీపీతో కలిసి ఉంటూ వస్తున్నప్పటికీ టిడిపి పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చారు.

ముఖ్యంగా అవినీతి కేసులలో వైఎస్ జగన్ విచారణ ముందుకు సాగకుండా కేంద్ర ప్రభుత్వం అండగా అంటూ ఉండడాన్ని చంద్రబాబు సహింపలేక పోయారు. ఇప్పుడు కూడా పరిస్థితులు అదేవిధంగా ఉన్నాయి. చంద్రబాబు వంటి జాతీయస్థాయిలో గతంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు ఒక రాష్త్ర ముఖ్యమంత్రిగా ఉండడాన్ని ప్రధాని మోదీ  సహించే ప్రసక్తి లేదు.

ఇప్పుడు అవసరం కోసం టిడిపితో పొత్తు పెట్టుకున్నా పరోక్షంగా వైఎస్ జగన్ కు అండగా ఉండే అవకాశం ఉంది. జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం కేంద్రం పూర్తి మద్దతు ఇస్తున్నట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ముందుకు సాగకుండా కట్టడి చేస్తున్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన జడ్జి “ఇప్పటి వరకు అవినాష్ ను అరెస్ట్ చేయాలి అనుకుంటే అడ్డుకున్నదెవరు?” అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు.  టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సమయంలోనే విజయసాయిరెడ్డి పిఎంఓలో హల్ ఛల్ చేసేవారు. టీడీపీ  కేంద్ర మంత్రులకు సహితం అక్కడ అంత పలుకుబడి ఉండెడిది కాదు.

బిజెపితో పొత్తు ఉంటె ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసులు అడ్డదిడ్డంగా ప్రవర్తించకుండా చేసుకోవడం కోసమే చంద్రబాబు ప్రస్తుతం తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తున్నది. చంద్రబాబులోని ఆ భయాన్నీ తమకు రాజకీయంగా సానుకూలంగా మలచుకోవాలని బిజెపి నాయకత్వం చూస్తున్నది.

చంద్రబాబు బిజెపితో కలిసినా టిడిపి ఓటర్లు బిజెపిని విశ్వసింపలేరని గ్రహించాలి. ముఖ్యంగా తెలంగాణాలో టీడీపీ ద్వారా ప్రయోజనం పొందాలని బిజెపి చూస్తున్నది. అయితే, తెలంగాణ బీజేపీ నేతలు మొదటి నుంచి సీమాంధ్ర ప్రజల పట్ల విద్వేషంతో వ్యవహరిస్తున్నారు. ఒక్కరికి ఎమ్యెల్యే సీట్ ఇవ్వలేదు. పార్టీ పదవులలో కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

అందుకనే టిడిపి తెలంగాణాలో కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని సహించలేని సీమాంధ్ర ప్రజలు కారణాలు ఏమైతేనేమి బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు బిజెపితో టిడిపి చేతులు కలిపినా పరిస్థితులు అదేవిధంగా ఉంటాయని, సీమాంధ్ర ప్రజలు బిజెపితో పోల్చుకొంటే బిఆర్ఎస్ తోనే సానుకూలంగా ఉన్నారని గ్రహించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles