బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ తో భగ్గుమన్న బీజేపీ నేతలు 

Saturday, January 18, 2025

మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇతర బిఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసురుతూ ఉండే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు అటువైపు నుండే తనకు సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ నేతకే సవాళ్లు విసురుతారా అంటి బిజెపి నేతలు భగ్గుమంటున్నారు. 

మొన్నటికి మొన్న ఎమ్యెల్యే పటేల్ సంతోష్ రెడ్డి విసిరిన సవాల్ కు `ఎవ్వరి సవాల్ ను బడితే వారి సవాల్ స్వీకరించను’ అంటూ తోకముడిగిన సంజయ్, తాజాగా ఐటి మంత్రి కేటీఆర్ నుండి సవాల్ ఎదురు కావడంతొ ఖంగుతిన్నట్లు కనిపిస్తుంది. 

“డ్రగ్స్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా. నేను క్లీన్ చీట్ తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ దగ్గర ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. “నేను ఇక్కడే ఉంటాను డాక్టర్లను తీసుకురమ్మను. నా రక్తం, గోర్లు, వెంట్రుకలు, చర్మం, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా”నని మంత్రి కేటీఆర్  సవాల్ విసిరారు. 

“కరీంనగర్ కు ఏమి చేశావంటే సమాధానం ఉండదు పిచ్చి కేకలు, పెడబొబ్బలు, గావు కేకలు తప్ప ఏమి చేతకాదు” అని మండిపడ్డారు. మోడీ, బోడి, ఈడీ చేతకాక వేట కుక్కలని వదులుతున్నారని కేటీఆర్  ఘాటుగా విమర్శించారు. 

 కేటిఆర్ డ్రగ్స్ కు బానిస. రక్తం, వెంట్రుకల నమూనా ఇస్తే నిరూపిస్తామని గతంలో సంజయ్ చేసిన సవాల్ కు కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. పని చేయడానికి చేతకాదు కానీ పనికిమాలిన మాటలు మాత్రం చెప్తారని ఎద్దేవా చేశారు. అసలు నీకు తెలివి ఉందా. ఇవేం రాజకీయాలు అని బండి సంజయ్ ను ఉద్దేశించి కేటీఆర్ ధ్వజమెత్తారు. 

దానితో ఎంపీ డి అరవింద్ రంగంలోకి దిగి కేటీఆర్ కిడ్నీలు, వెంట్రుకలు, గోళ్లు ఎవరికి కావాలని కొట్టిపారవేశారురు. కేటీఆర్ మిత్రులు డ్రగ్స్ కేసులో ఉన్నందున ఆయనపై పదేపదే ఆరోపణలు వస్తున్నాయని చెబుతూ కేటీఆర్ స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. అంతేగాని సంజయ్ ఇదివరలో చేసిన సవాల్ గురించి ప్రస్తావించలేదు. 

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఎప్పుడో సంజయ్ చేసిన సవాల్ కు ఇప్పుడు కేటీఆర్ సవాల్ చేస్తారా అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. అప్పుడే సంజయ్ సవాల్ చేసినప్పుడు నీ గోళ్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదని ఆమె నిలదీశారు. అప్పుడు డ్రగ్స్  తీసుకున్నందుకు ఇవ్వలేదా? అంటూ ఎద్దేవా చేశారు. 

ఇటీవల టిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ సహితం సంజయ్ చేసిన సవాల్, వాడిన భాషను ప్రస్తావించకుండా సంజయ్ ను చెప్పుతో కొడతాం అంటూ కేటీఆర్ చేసిన వాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. ఈ వాఖ్యల ద్వారా బీసీలంటే చులకన అని మరో సారి నిరూపించుకున్నారని అంటూ  మొత్తం వివాదం మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles