ప్రతిపక్ష కూటమి చైర్మన్ పదవికి కేసీఆర్ భారీ డీల్!

Wednesday, January 22, 2025

టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి, 2024 ఎన్నికలలో కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఢీ కొనేందుకు సై అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనతో కలసి వచ్చే ప్రాంతీయ పార్టీలకు భారీ డీల్ ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడైనది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్ గా చేస్తే, ఆ పార్టీలకు అయ్యే ఎన్నికల ఖర్చు అంతటిని తానే భరిస్తానని ఎవ్వరూ ఊహించని ఆఫర్ చేస్తున్నారు.

వ్యక్తిగత సంభాషణలలో సహచరులతో ఈ మాట అన్నట్టు ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేసాయ్ ప్రతివారం వ్రాసే తన బ్లాగ్ లో తాజా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ఈ సంచలన విషయం బయటపెట్టారు. జాతీయ స్థాయిలో మోదీని ఎదిరించడానికి ప్రాంతీయ పార్టీ నేతల ఇగో అడ్డం వస్తున్నదని, ప్రతివారూ తామే జాతీయ స్థాయి నాయకులం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యవహరించారు.

అయితే, మొదట్లో కేసీఆర్ తో జతకట్టిన మమతా బెనర్జీ, హెచ్ డి దేవెగౌడ, ఎంకే స్టాలిన్ వంటి నేతలు ఇప్పుడు ఒక విధంగా దూరంతా నెట్టుతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం రాజకీయంగా కేసీఆర్ విశ్వసనీయత వారిలో అనుమానాలను రేకెక్తిస్తున్నది. ఒకవంక ప్రతిపక్ష కూటమి అంటూ, మరోవంక బిజెపితో బేరాలు ఆడారని నమ్మలేమని భావిస్తున్నారు.

అయితే అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారు కేవలం ఎన్నికలలో నిధులు సమకూరుస్తారని మాత్రమే కేసీఆర్ తో జతకట్టేందుకు ముందుకు వస్తున్నారు గాని, ఆయనతో కలసి పొత్తులకు సిద్దపడటం లేదని రాజదీప్ వాఖ్యాలను గమనిస్తే అర్థం అవుతుంది.

మరోవంక, గత కొన్ని రోజులుగా రాజకీయంగా కేసీఆర్ దాదాపు మౌనంగా ఉండటం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. మొన్నటి వరకు ఇతర రాస్త్రాలలో బిఆర్ఎస్ వ్యాప్తి కోసం చురుకుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు దాదాపు మౌనం వహిస్తున్నారు. కేవలం మహారాష్ట్ర విషయంలోనే ఉత్సాహం చూపుతున్నారు.

నిత్యం ఆ రాష్ట్రం నుండి చిన్నపాటి నేతలను పార్టీలో చేర్చుకొంటూ, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలంటూ హడావుడి చేస్తున్నారు.

కర్ణాటక నుండే బిఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభిస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా నోరు మెదపడం లేదు. కనీసం ఆ రాష్ట్రం నుండి ఎవ్వరూ బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా లేదు. చివరకు కొద్దీ రోజులుగా మంత్రులకు, పార్టీ ఎమ్యెల్యేలు, ఎంపీలకు సహితం అందుబాటులో ఉండటం లేదు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత గురించి మొదటిరోజు ఖండించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ ప్రస్తావన తీసుకు రావడం లేదు. జాతీయ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై యెగిరి పడటం లేదు. ముఖ్యంగా కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో లోతుగా చిక్కుకున్నట్లు వెల్లడైనప్పటి నుండి మౌనంగా ఉండటం కనిపిస్తుంది.

తెలంగాణ రాజకీయాలను కుదిపివేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం, టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారం గురించి కేసీఆర్ ఇప్పటివరకు నోరువిప్పడం లేదు. మద్యం కుంభకోణం గురించి న్యాయనిపుణులతో సమాలోచనలు చేస్తున్నప్పటికీ, పేపర్ లీకేజి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటం లేదు.

కవితను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తేలిన తర్వాతనే రాహుల్ గాంధీకి సంఘీభావం తెలపడం, ఢిల్లీలో ఉమ్మడి ప్రతిపక్ష సమావేశాలకు బిఆర్ఎస్ హాజరు కావడం జరుగుతూ వస్తోంది. మరోవంక, పేపర్ లీకేజీ వ్యవహారంలో సహితం ఈడీ ప్రవేశించడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా, నెమ్మదిగా వ్యవహరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

మొదట్లో ఆంధ్ర ప్రదేశ్ లో బిఆర్ఎస్ వ్యాప్తి గురించి ఆసక్తి చూపిన ఆయన ఈ మధ్య ఆ రాష్ట్ర నేతలు ఎవ్వరితో భేటీలు కూడా జరుపుతున్న దాఖలాలు లేవు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తడం ద్వారా కేటీఆర్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టె ప్రయత్నం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles